భారత్‌ను కరెన్సీ మానిప్యులేటర్ వాచ్‌లిస్ట్‌లో చేర్చిన దేశం?
Sakshi Education
బారత్ కరెన్సీకి సంబంధించి అమెరికా ఆర్థిక శాఖ కీలక చర్య తీసుకుంది.
భారత్‌ను ‘‘కరెన్సీ మానిప్యులేటర్ వాచ్‌లిస్ట్’’లో చేర్చింది. రూపాయి మారకపు విలువను స్థిరంగా ఉంచడానికి పరిమితి 2 శాతానికి (స్థూల దేశీయోత్పత్తిలో) మించి 5 శాతం మేర డాలర్లను భారత్ కొనుగోలు చేసిందని ఏప్రిల్ 20న అమెరికా తెలిపింది. తద్వారా తమ దేశంతో వాణిజ్యలోటు నిర్వహణకు యత్నిస్తోందని సూచించింది. మహమ్మారి విజృంభన తర్వాత భారత్‌ను అమెరికా ‘కరెన్సీ మానిప్యులేటర్ వాచ్‌లిస్ట్’లో చేర్చడం ఇది రెండవసారి. కాగా, అమెరికా చర్యను భారత్ తోసిపుచ్చింది.
మరో 10 దేశాలూ...
కరెన్సీకి సంబంధించి భారత్‌తో పాటు చైనా, జపాన్, దక్షిణ కొరియా, జర్మనీ, ఐర్లాండ్, ఇటలీ, మలేషియా, సింగపూర్, థాయ్‌లాండ్, మెక్సికోలను కరెన్సీ మానిప్యులేటర్ వాచ్‌లిస్ట్‌లో ఉంచుతున్నట్లు అమెరికా ఆర్థికశాఖ తెలిపింది. ఈ పది దేశాల్లో ఐర్లాండ్, మెక్సికో మినహా మిగిలిన దేశాలన్నీ 2020 డిసెంబర్‌లో ప్రకటించిన జాబితాలోనూ ఉన్నాయి.
క్విక్ రివ్యూ :
ఏమిటి : భారత్‌ను కరెన్సీ మానిప్యులేటర్ వాచ్‌లిస్ట్‌లో చేర్చిన దేశం?
ఎప్పుడు : ఏప్రిల్ 20
ఎవరు : అమెరికా
ఎందుకు : రూపాయి మారకపు విలువను స్థిరంగా ఉంచడానికి పరిమితి 2 శాతానికి మించి 5 శాతం మేర డాలర్లను భారత్ కొనుగోలు చేసిందని...

Published date : 21 Apr 2021 07:17PM