భారత్‌లో కామన్‌వెల్త్ షూటింగ్, ఆర్చరీ క్రీడలు
Sakshi Education
2022 జనవరిలో జరిగే కామన్‌వెల్త్ షూటింగ్, ఆర్చరీ చాంపియన్‌షిప్ పోటీలకు భారత్ ఆతిధ్యం ఇవ్వనుంది.
ఈ మేరకు కామన్‌వెల్త్ గేమ్స్ ఫెడరేషన్(సీజీఎఫ్) ఫిబ్రవరి 24న ప్రకటన విడుదల చేసింది. ఈ పోటీల్లో సాధించే పథకాలను 2022 జులై 27 నుంచి బర్మింగ్‌హామ్‌లో జరిగే కామన్‌వెల్త్ క్రీడల ర్యాంకింగ్‌సకు పరిగణనలోకి తీసుకోనునట్లు సీజీఎఫ్ పేర్కొంది. షూటింగ్, ఆర్చరీ ఈవెంట్లను 2022 జనవరిలో నిర్వహిస్తామని భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) తెలిపింది.
2022 కామన్వెల్త్ గేమ్స్‌కు బర్మింగ్‌హామ్ జూలై 27 నుంచి ఆగస్టు 7 వరకు ఆతిథ్యమివ్వనుంది. అయితే అతిథ్య దేశానికి ఉన్న సౌలభ్యం మేరకు ఇంగ్లండ్ రోస్టర్ విధానంలో భాగంగా షూటింగ్, ఆర్చరీ ఈవెంట్లను గేమ్స్ నుంచి తప్పించింది. దీనిపై గుర్రుగా ఉన్న ఐఓఏ గేమ్స్‌ను బహిష్కరిస్తామని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో కామన్వెల్త్ గేమ్స్ కంటే ముందుగా ఆ రెండు క్రీడల్ని భారత్‌లో నిర్వహించాలని, అందులో సాధించిన పతకాల్ని ప్రధాన గేమ్స్ పట్టికలో ఓ వారం తర్వాత చేరుస్తామని సీజీఎఫ్ తెలిపింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : 2022 కామన్‌వెల్త్ షూటింగ్, ఆర్చరీ క్రీడలు
ఎప్పుడు : ఫిబ్రవరి 24
ఎవరు : కామన్‌వెల్త్ గేమ్స్ ఫెడరేషన్(సీజీఎఫ్)
ఎక్కడ : భారత్

Published date : 25 Feb 2020 06:18PM