భారత్‌లో అత్యంత విశ్వసనీయ బ్రాండ్‌గా నిలిచిన బ్రాండ్?
Sakshi Education
అమెరికాకు చెందిన కంప్యూటర్స్ బ్రాండ్ ‘డెల్’.. భారత్‌లో వరుసగా రెండో ఏడాదీ అత్యంత విశ్వసనీయ బ్రాండ్‌గా నిలిచింది.
డెల్ తర్వాత చైనాకు చెందిన షావోమి మొబైల్స్ రెండో స్థానంలో, కొరియన్ దిగ్గజం శాంసంగ్ మొబైల్స్ మూడో స్థానం దక్కించుకున్నాయి. మొత్తం మీద ఎనిమిదో స్థానంలో ఉన్నప్పటికీ ఆటోమొబైల్ విభాగంలో మారుతి సుజుకీ అగ్రస్థానంలో నిలిచింది. విశ్వసనీయ బ్రాండ్‌సపై వినియోగదారులతో నిర్వహించిన సర్వే ఆధారంగా టీఆర్‌ఏ రీసెర్చ్ సంస్థ రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. 16 నగరాల్లో 1,711 మంది వినియోగదారులు ఈ అధ్యయనంలో పాల్గొన్నారు. 323 కేటగిరీల్లో మొత్తం 8,000 బ్రాండ్‌సను పరిగణనలోకి తీసుకున్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : వరుసగా రెండో ఏడాదీ అత్యంత విశ్వసనీయ బ్రాండ్‌గా డెల్
ఎప్పుడు : డిసెంబర్ 2
ఎవరు : టీఆర్‌ఏ రీసెర్చ్ సంస్థ
ఎక్కడ : భారత్
బ్రాండ్ | ర్యాంకు |
డెల్ | 1 |
షావోమి మొబైల్స్ | 2 |
శాంసంగ్ మొబైల్స్ | 3 |
యాపిల్ ఐఫోన్ | 4 |
ఎల్‌జీ టెలివిజన్ | 5 |
ఒప్పో | 6 |
సోనీ ఎంటర్‌టైన్‌మెంట్ | 7 |
మారుతి సుజుకీ | 8 |
శాంసంగ్ టెలివిజన్స్ | 9 |
వివో మొబైల్స్ | 10 |
క్విక్ రివ్యూ :
ఏమిటి : వరుసగా రెండో ఏడాదీ అత్యంత విశ్వసనీయ బ్రాండ్‌గా డెల్
ఎప్పుడు : డిసెంబర్ 2
ఎవరు : టీఆర్‌ఏ రీసెర్చ్ సంస్థ
ఎక్కడ : భారత్
Published date : 03 Dec 2020 05:48PM