Skip to main content

భారత్‌లో ఆర్థిక మందగమనం : ఐఎంఎఫ్

భారత్‌లో ఆర్థిక మందగమన పరిస్థితులు తీవ్రంగా ఉన్నాయని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) అభిప్రాయపడింది.
Current Affairsదీర్ఘకాల ఈ ధోరణిని అరికట్టడానికి ప్రభుత్వం తక్షణం విధానపరమైన చర్యలు తీసుకోవాలని సూచించింది. ఈ మేరకు భారత్ ఆర్థిక రంగానికి సంబంధించి ఐఎంఎఫ్ ఒక నివేదికను రూపొందించింది. ఈ నివేదికలోని అంశాలను ఐఎంఎఫ్ ఆసియా, పసిఫిక్ శాఖలో భారత్ వ్యవహారాల చీఫ్ రానిల్ సల్‌గాడో డిసెంబర్ 24న వెల్లడించారు.

ఐఎంఎఫ్ నివేదికలోని ముఖ్యాంశాలు
  • 2019 సంవత్సరం నుంచీ భారత్‌లో ఆర్థిక వృద్ధి పూర్తి మందగమనంలో జారిన జాడలు సుస్పష్టమయ్యాయి. తగిన విధానపరమైన చర్యలు తీసుకోకపోతే, ఈ పరిస్థితి దీర్ఘకాలం కొనసాగే అవకాశం ఉంది. అయితే భారీ వృద్ధి తర్వాత వచ్చే దిగువబాటగానే (సైక్లికల్) మేము ఈ పరిస్థితిని ఇంకా పరిగణిస్తున్నాం.
  • ప్రస్తుతం 2019-20లో భారత్ జీడీపీ వృద్ధిరేటు 6.1 శాతం ఉంటుందని అంచనా. అంచనాల సవరణ నిర్ణయం జనవరిలో ఉంటుంది.
  • దేశీయంగా ప్రైవేటు డిమాండ్‌లో కేవలం ఒక శాతం వృద్ధి రేటు నమోదయి్యందని గణాంకాలు పేర్కొంటున్నాయి.
  • తగినంత వ్యాపార విశ్వాసం లేకపోవడం వల్ల బ్యాంకింగ్ రంగంలో రుణ వృద్ధి మందగమనం కొనసాగుతోంది.
  • భారత్ ఆర్థిక రంగానికి సంబంధించి కొన్ని సానుకూల అంశాలూ ఉన్నాయి. అందులో విదేశీ మారక నిల్వలు రికార్డు స్థాయిలో ఉండడం ఒకటి.
  • ప్రస్తుతం భారత్ ద్రవ్యలోటు (ప్రభుత్వ ఆదాయాలు-వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం) సమస్యను ఎదుర్కొంటోంది. ఈ పరిస్థితుల్లో ఆర్థిక వ్యవస్థకు ఉద్దీపనలు ప్రకటించడానికి పరిమితులు ఉన్నాయి. 2019- 20 ఆర్థిక సంవత్సరం మొత్తంలో ఈ పరిమాణం రూ.7.03 లక్షల కోట్లుగా ఉండాలన్నది (జీడీపీలో 3.3 శాతం) బడ్జెట్ లక్ష్యం. కానీ అక్టోబర్ ముగిసే నాటికే ఈ మొత్తం రూ.7,20,445 కోట్లకు చేరింది.
Published date : 25 Dec 2019 05:36PM

Photo Stories