భారత్‌లో 2022 ఆసియా కప్ ఫుట్‌బాల్ టోర్నీ
Sakshi Education
భారత్ మరో ప్రతిష్టాత్మక ఫుట్‌బాల్ టోర్నమెంట్‌కు వేదిక కానుంది. 2020 ఏడాది అండర్-17 మహిళల ప్రపంచకప్‌కు ఆతిథ్యమివ్వనున్న భారత్... 2022లో మహిళల ఆసియా కప్ ఈవెంట్‌కు వేదికగా నిలువనుంది.
ఈ మేరకు భారత్‌కు ఆతిథ్య హక్కులు కట్టబెడుతూ ఆసియా ఫుట్‌బాల్ సమాఖ్య (ఏఎఫ్‌సీ) ఫిబ్రవరి 19న ప్రకటన జారీ చేసింది. 2022 ఆసియా కప్‌లో ఎనిమిది జట్లకు బదులుగా 12 జట్లు పాల్గొంటాయని ఏఎఫ్‌సీ మహిళల కమిటీ చైర్‌పర్సన్ మెహఫూజా అక్తర్ తెలిపారు. గతంలో భారత్ 2016లో అండర్-16 ఆసియా కప్, 2017లో అండర్-17 ప్రపంచకప్ పోటీలను నిర్వహించింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : 2022 మహిళల ఆసియా కప్ ఫుట్‌బాల్ టోర్నీకి ఆతిథ్యం
ఎప్పుడు : ఫిబ్రవరి 19
ఎవరు : భారత్
క్విక్ రివ్యూ :
ఏమిటి : 2022 మహిళల ఆసియా కప్ ఫుట్‌బాల్ టోర్నీకి ఆతిథ్యం
ఎప్పుడు : ఫిబ్రవరి 19
ఎవరు : భారత్
Published date : 20 Feb 2020 07:20PM