Skip to main content

భారత్‌కు శరణార్థిగా వచ్చిన చిన్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి?

భారత్‌ పొరుగు దేశం మయన్మార్‌లో సైనిక తిరుగుబాటు వల్ల సామాన్య జనం అష్టకష్టాలు పడుతున్నారు.
Current Affairs ప్రజాప్రతినిధులు సైతం ఇతర దేశాల్లో తలదాచుకోవాల్సి వస్తోంది. మయన్మార్‌లోని చిన్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి సలాయ్‌ లియాన్‌ లూవాయీ భారత్‌లోని మిజోరాంలో శరణార్థిగా రక్షణ పొందుతున్నట్లు అధికారులు ఇటీవల తెలిపారు. ఆయనతోపాటు మొత్తం 9,247 మంది మయన్మార్‌ పౌరులు మిజోరాంలో శరణార్థులుగా ఉన్నారని పేర్కొన్నారు.

పశ్చిమ మయన్మార్‌లో ఉన్న చిన్‌ రాష్ట్రం మిజోరాంతో సరిహద్దును పంచుకుంటోంది. చిన్‌ ముఖ్యమంత్రి సలాయ్‌... అంతర్జాతీయ సరిహద్దును దాటి, మిజోరాంలోని చాంఫాయ్‌ పట్టణంలోకి అడుగుపెట్టారు. ఆంగ్‌సాన్‌ సూకీకి చెందిన నేషనల్‌ లీగ్‌ ఫర్‌ డెమొక్రసీ(ఎన్‌ఎల్‌డీ) నుంచి చట్టసభలకు ఎన్నికైన 24 మంది ప్రజాప్రతినిధులు కూడా మిజోరాంలో తలదాచుకుంటున్నారు. మిజోరాంలో దశాబ్దాలుగా నివసిస్తున్న మయన్మార్‌ మూలాలున్న ప్రజలు వారికి ఆశ్రయమిస్తున్నారు.

క్విక్‌ రివ్యూ :
ఏమిటి : భారత్‌కు శరణార్థిగా వచ్చిన చిన్‌ రాష్ట్ర(మహారాష్ట్ర) ముఖ్యమంత్రి?
ఎప్పుడు : జూన్‌ 15
ఎవరు : సలాయ్‌ లియాన్‌ లూవాయీ
ఎక్కడ : చాంఫాయ్‌ పట్టణం, మిజోరాం
ఎందుకు : మయన్మార్‌లో సైనిక తిరుగుబాటు వల్ల...
Published date : 16 Jun 2021 07:40PM

Photo Stories