భారత్‌కు ఏఐఐబీ 3 బిలియన్ డాలర్ల రుణం
Sakshi Education
భారత్‌లోకి వివిధ మౌలిక ప్రాజెక్టులకు వచ్చే ఏడాది కాలంలో 3 బిలియన్ డాలర్ల రుణాలు అందించడానికి సంబంధించిన ప్రణాళికలను బీజింగ్ కేంద్రంగా పనిచేస్తున్న ఆసియన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ (ఏఐఐబీ) పరిశీలిస్తోంది.
ఈ ప్రాజెక్టుల్లో ఢిల్లీ-మీరట్ ర్యాపిడ్ రైల్ , ముంబై మెట్రో రైల్, ముంబై అర్బన్ ట్రాన్స్ పోర్ట్ ప్రాజెక్టు, చెన్నై పెరిఫిరల్ రింగ్ రోడ్డు ప్రాజెక్టు, హరియాణా బైపాస్ లింక్ రైల్వే ఉన్నాయని బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్ డీజే పాండ్యన్ ఒక ఇంటర్వ్యూలో తెలిపారు.
మెత్తం రుణాల్లో 25 శాతం..
ఏఐఐబీ ఇచ్చిన మొత్తం రుణాల్లో 25 శాతంతో భారత్ అతిపెద్ద రుణ గ్రహీతగా ఉందని ఈ సందర్భంగా పాండ్యన్ తెలిపారు. 2020 జూలై 16 నాటికి 24 దేశాల్లోకి 87 ప్రాజెక్టులకు 19.6 బిలియన్ డాలర్ల రుణాలను ఏఐఐబీ ఆమోదించినట్లు వెల్లడించారు. 2016లో ఏఐఐబీ ప్రారంభమైననాటి నుంచీ భారత్‌లోకి 17 ప్రాజెక్టులకు 4.3 బిలియన్ డాలర్ల రుణాలను ఆమోదించినట్లు చెప్పారు.
టీవీలపై నియంత్రణ..
కలర్ టీవీల దిగుమతులపై నియంత్రణలు విధిస్తూ భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో పలు రకాల టీవీలను దిగుమతి చేసుకోవాలంటే తప్పకుండా కేంద్ర వాణిజ్య శాఖ పరిధిలోని డెరైక్టర్ జనరల్ ఆఫ్ ఫారీన్ ట్రేడ్ (డీజీఎఫ్‌టీ) నుంచి లెసైన్స్ పొందాలి.
క్విక్ రివ్యూ :
ఏమిటి : భారత్‌కు 3 బిలియన్ డాలర్ల రుణం
ఎప్పుడు : జూలై 30
ఎవరు : ఆసియన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ (ఏఐఐబీ)
ఎందుకు : భారత్‌లోకి వివిధ మౌలిక ప్రాజెక్టులకుమెత్తం రుణాల్లో 25 శాతం..

Published date : 01 Aug 2020 12:53PM