భారత్‌కు 21 బిలియన్ల పెట్టుబడులు
Sakshi Education
భారత్‌లోని హైటెక్ రంగాలకు రానున్న ఐదేళ్ల కాలంలో 21 బిలియన్ డాలర్ల (రూ.1.47 లక్షల కోట్లు) మేర పెట్టుబడులను ఆకర్షించే సామర్థ్యాలు ఉన్నాయని అమెరికా-భారత్ వ్యూహాత్మక, భాగస్వామ్య ఫోరం (యూఎస్‌ఐఎస్‌పీఎఫ్) పేర్కొంది.
తద్వారా లక్షలాది ఉద్యోగాల కల్పన సాధ్యపడుతుందని వివరించింది. ఈ మేరకు సెప్టెంబర్ 11న ఒక నివేదికను విడుదల చేసింది. ‘భారత్‌లో హైటెక్ తయారీ’ పేరుతో రూపొందించిన ఈ నివేదికను ఈ సంస్థ భారత ప్రభుత్వానికి సమర్పించింది.
నివేదికలోని అంశాలు-వివరాలు
క్విక్ రివ్యూ :
ఏమిటి : భారత్‌కు 21 బిలియన్ల పెట్టుబడులు
ఎప్పుడు : సెప్టెంబర్ 11
ఎవరు : అమెరికా-భారత్ వ్యూహాత్మక, భాగస్వామ్య ఫోరం (యూఎస్‌ఐఎస్‌పీఎఫ్)
నివేదికలోని అంశాలు-వివరాలు
- భారత్‌లోని హైటెక్ రంగాలు (ఎలక్ట్రానిక్స్, ఏవియేషన్, వైద్య పరికరాలు) 5,50,000 ప్రత్యక్ష ఉద్యోగాలతోపాటు పరోక్షంగా 14,00,000 ఉద్యోగాలను తీసుకురాగలవు.
- ఎలక్ట్రానిక్స్, ఏరోస్పేస్, వైద్య పరికరాల రంగాల్లో ప్రస్తుతానికి భారత్ వాటా 3 శాతానికి మించి లేదు.
- భారత్‌లోని హైటెక్ రంగాల్లో పెట్టుబడులు పెట్టే విషయమై అమెరికన్ కంపెనీల అభిప్రాయాలను క్రోడీకరించి ఈ నివేదిక రూపొందించడం జరిగింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : భారత్‌కు 21 బిలియన్ల పెట్టుబడులు
ఎప్పుడు : సెప్టెంబర్ 11
ఎవరు : అమెరికా-భారత్ వ్యూహాత్మక, భాగస్వామ్య ఫోరం (యూఎస్‌ఐఎస్‌పీఎఫ్)
Published date : 12 Sep 2019 03:58PM