భారత్‌కి చెందిన రవి కుమార్ దహియా ఏ క్రీడకు చెందినవాడు?
Sakshi Education
కజకిస్తాన్‌లోని అల్మాటీలో జరుగుతున్న ఆసియా సీనియర్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్–2021 పురుషుల ఫ్రీస్టయిల్ విభాగంలో భారత రెజ్లర్లు అదరగొట్టారు.
ఏప్రిల్ 17న బరిలోకి దిగిన ఐదు వెయిట్ కేటగిరీల్లోనూ భారత్‌కు పతకాలు వచ్చాయి. రవి కుమార్ దహియా (57 కేజీలు) స్వర్ణం గెలుచుకోగా.. బజరంగ్ పూనియా (65) రజత పతకం సాధించాడు. కరణ్ (70 కేజీలు), నర్సింగ్ యాదవ్ (79 కేజీలు), సత్యవర్త్ కడియాన్ (97 కేజీలు) కాంస్య పతకాలు కైవసం చేసుకున్నారు.
ఇప్పటికే టోక్యో ఒలింపిక్స్–2021కు అర్హత సాధించిన రవి కుమార్(ఢిల్లీ)... అలీరెజా (ఇరాన్)తో జరిగిన ఫైనల్లో 9–4 పాయింట్లతో గెలిచాడు. 2020, న్యూఢిల్లీలో జరిగిన ఆసియా చాంపియన్‌షిప్‌లోనూ రవి కుమార్ స్వర్ణ పతకాన్ని సాధించాడు. మరోవైపు ఏప్రిల్ 18న జరిగిన పోటీల్లో దీపక్ పూనియా (86 కేజీలు) రజతం, సంజీత్ (92 కేజీలు) కాంస్యం గెలిచారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఆసియా సీనియర్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్–2021 పురుషుల ఫ్రీస్టయిల్ విభాగంలో స్వర్ణం గెలిచిన క్రీడాకారుడు
ఎప్పుడు : ఏప్రిల్ 17
ఎవరు : రవి కుమార్ దహియా (57 కేజీలు)
ఎక్కడ : అల్మాటీ, కజకిస్తాన్

Published date : 19 Apr 2021 06:18PM