భారతీయుల సగటు ఆయుఃప్రమాణం ఎన్ని సంవత్సరాలు?
Sakshi Education
సెంట్రల్ సెన్సస్ రిజిస్ట్రార్ జనరల్ తాజగా విడుదల చేసిన నివేదిక ప్రకారం... భారతీయుల సగటు ఆయుఃప్రమాణం 69.40 ఏళ్లుగా ఉంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : భారతీయుల సగటు ఆయుఃప్రమాణం 69.40 ఏళ్లు
ఎప్పుడు : అక్టోబర్ 4
ఎవరు : సెంట్రల్ సెన్సస్ రిజిస్ట్రార్ జనరల్
2014-2018 సంవత్సరాలకు సంబంధించి నిర్వహించిన శాంపిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ (ఎస్‌ఆర్‌ఎస్) ఆధారంగా ఈ నివేదికను రూపొందించారు.
నివేదికలోని ప్రధాన అంశాలు...
- -భారతీయుల సగటు ఆయుఃప్రమాణం 69.40 ఏళ్లు. మహిళల సగటు ఆయుఃప్రమాణం 70.70 ఏళ్లు కాగా.. పురుషుల ఆయుఃప్రమాణం 68.20 ఏళ్లు.
- ఆంధ్రప్రదేశ్‌లో పౌరుల సగటు జీవిత కాలం 70 ఏళ్లు. మహిళల్లో సగటు జీవిత కాలం 71.40 ఏళ్లు కాగా.. పురుషుల సగటు జీవిత కాలం 68.70 ఏళ్లు.
- ప్రజల ఆయుఃప్రమాణంలో దేశంలో ఢిల్లీ మొదటి స్థానంలో ఉంది. ఢిల్లీలో పౌరుల సగటు జీవిత కాలం 75.30 ఏళ్లు. కాగా, మహిళల్లో 77 ఏళ్లు, పురుషుల్లో 73.80 ఏళ్లుగా ఉంది.
- రెండో స్థానంలో కేరళ.. మూడో స్థానంలో జమ్మూ-కశ్మీర్ నిలవగా.. ఆంధ్రప్రదేశ్ పదో స్థానంలో ఉంది.
- కేరళ, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో పట్టణ ప్రాంత మహిళల కంటే.. గ్రామీణ ప్రాంత మహిళల జీవిత కాలం ఎక్కువ.
- మిగిలిన అన్ని రాష్ట్రాల్లోనూ గ్రామీణ ప్రాంతాల కంటే పట్టణ ప్రాంతాల మహిళల జీవిత కాలం అధికంగా ఉంది.
- దేశంలో ఆహార భద్రత, వైద్య, ఆరోగ్య సేవలు విస్తరిస్తుండటంతో ప్రజల జీవిత కాలం పెరుగుతూ వస్తోంది.
- 1970-75లో సగటు భారతీయుని జీవిత కాలం 49.70 ఏళ్లుగా ఉండేది. 2014-18 నాటికి అది 69.40 ఏళ్లకు పెరగడం విశేషం.
- 1970-90లలో భారతీయుల సగటు జీవిత కాలం దాదాపు మూడేళ్లు పెరిగింది. కాగా 2014-18లో 0.40 ఏళ్లు పెరిగింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : భారతీయుల సగటు ఆయుఃప్రమాణం 69.40 ఏళ్లు
ఎప్పుడు : అక్టోబర్ 4
ఎవరు : సెంట్రల్ సెన్సస్ రిజిస్ట్రార్ జనరల్
Published date : 06 Oct 2020 11:41AM