Skip to main content

భారతదేశ మొట్ట మొదటి సీప్లేన్ సేవలు ఎక్కడ ప్రారంభమయ్యాయి?

గుజరాత్‌లోని నర్మదా జిల్లా కేవాడియాలో భారతదేశ మొట్ట మొదటి సీప్లేన్ సేవలు ప్రారంభమయ్యాయి.
Current Affairs
కేవాడియాలోని పటేల్ ఐక్యతా విగ్రహం నుంచి అహ్మదాబాద్‌లోని సబర్మతి రివర్‌ఫ్రంట్ వరకు తొలి సీప్లేన్ సేవలను ప్రధాని నరేంద్ర మోదీ అక్టోబర్ 31న ప్రారంభించారు. నీటిపై, గాలిలో ప్రయాణించే విమానాన్ని సీప్లేన్ అంటారు.

సర్దార్ సరోవర్ డ్యామ్ నీటిపై...
ఐక్యతా విగ్రహం నుంచి సీప్లేన్‌లో మోదీ ప్రయాణించారు. 40 నిమిషాల్లో సబర్మతి రివర్‌ఫ్రంట్‌కు చేరుకున్నారు. ఈ రెండింటి మధ్య దూరం 200 కిలోమీటర్లు. సీప్లేన్ సర్వీసును స్పైస్‌జెట్ సంస్థకు చెందిన స్పైస్ షటిల్ సంస్థ నిర్వహిస్తోంది. అహ్మదాబాద్-కేవాడియా మధ్య నిత్యం రెండు ప్లేన్లను నడపనుంది. సర్దార్ సరోవర్ డ్యామ్ నీటిపై సీప్లేన్ ల్యాండ్ అవుతుంది.

రాష్ట్రీయ ఏక్తా దివస్...
సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ 145వ జయంతి సందర్భంగా అక్టోబర్ 31న గుజరాత్ రాష్ట్రం నర్మదా జిల్లాలోని కేవాడియాలో సర్దార్ ఐక్యతా విగ్రహం వద్ద ప్రధాని మోదీ ఘనంగా నివాళులర్పించారు. ఇక్కడ నిర్వహించిన రాష్ట్రీయ ఏక్తా దివస్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

క్విక్ రివ్యూ :

ఏమిటి : భారతదేశ మొట్ట మొదటి సీప్లేన్ సేవలుప్రారంభం
ఎప్పుడు : అక్టోబర్ 31
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : సర్దార్ సరోవర్ డ్యామ్, కేవాడియా, నర్మదా జిల్లా, గుజరాత్
ఎందుకు : పర్యాటక రంగ అభివృద్ధి కోసం
Published date : 02 Nov 2020 06:01PM

Photo Stories