Skip to main content

భారత వృద్ధి రేటు అంచనాలు సవరణ

2017-18 ఆర్థిక సంవత్సరానికి భారత ఆర్థిక వృద్ధి రేటు అంచనాలను కేంద్రం ప్రభుత్వం జనవరి 31న సవరించింది.
ఈ మేరకు ఇంతకు ముందు 6.7 శాతం వృద్ధి అంచనా వేయగా.. దాన్ని 7.2 శాతానికి పెంచుతున్నట్లు కేంద్ర గ‌ణాంక కార్యాలయం (సీఎస్‌ఓ) పేర్కొంది. వాస్తవ జీడీపీ లేదా 2011-12 ధరల వద్ద జీడీపీ 2016-17లో రూ.122.98 లక్షల కోట్లు, 2017-18లో రూ.131.80 లక్షల కోట్లుగా నమోదైందని తెలిపింది. ఫలితంగా వృద్ధి వరుసగా 7.2 శాతం, 8.2 శాతం చొప్పున పెరిగిందని వివరించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2018-19)లో జీడీపీ వృద్ధి 7.2 శాతంగా నమోదు కావొచ్చని 2018, మేలో సీఎస్‌ఓ ముందస్తు అంచనాల్లో పేర్కొంది.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
2017-18 ఆర్థిక సంవత్సరానికి భారత వృద్ధి రేటు అంచనాలు సవరణ
ఎప్పుడు : జనవరి 31
ఎవరు : కేంద్ర ప్రభుత్వం
Published date : 01 Feb 2019 05:09PM

Photo Stories