Skip to main content

భారత్ తరఫున 81వ ఆటగాడిగా రాహుల్

గయానాలో వెస్టిండీస్‌తో ఆగస్టు 6న జరిగిన చివరిదైన మూడో టి20 మ్యాచ్‌లో లెగ్ స్పిన్నర్ రాహుల్ చహర్ అరంగేట్రం చేశాడు.
ఈ క్రమంలో టి20ల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన 81వ క్రికెటర్‌గా అతను గుర్తింపు పొందాడు. భారత్ తరఫున టి20ల్లో అరంగేట్రం చేసిన నాలుగో పిన్న వయస్కుడిగా రాహుల్ (20 ఏళ్ల 2 రోజులు) నిలిచాడు. ఈ జాబితాలో వాషింగ్టన్ సుందర్ (18 ఏళ్ల 80 రోజులు), రిషభ్ పంత్ (19 ఏళ్ల 120 రోజులు), ఇషాంత్ శర్మ (19 ఏళ్ల 152 రోజులు) తొలి మూడు స్థానాల్లో ఉన్నారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
టి20ల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన 81వ క్రికెటర్
ఎప్పుడు : ఆగస్టు 6
ఎవరు : రాహుల్ చహర్
Published date : 07 Aug 2019 05:38PM

Photo Stories