Skip to main content

భారత ఫార్మా కంపెనీలపై చైనా హ్యాకర్ల దాడి

కోవిడ్‌–19కి టీకా తయారు చేస్తున్న రెండు భారత ఫార్మా కంపెనీలను చైనా హ్యాకర్లు లక్ష్యంగా చేసుకున్నారని సైబర్‌ నిఘా సంస్థ ‘సైఫర్మా’ వెల్లడించింది.
Current Affairs
‘ఏపీటీ 10’, ‘స్టోన్‌ పాండా’ అనే పేర్లున్న ఆ హ్యాకింగ్‌ బృందానికి చైనా ప్రభుత్వం మద్దతుందని మార్చి 1న తెలిపింది. భారత్‌ బయోటెక్, సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా సంస్థలకు చెందిన ఐటీ వ్యవస్థల్లో, పంపిణీ చైన్‌లో లొసుగులను హ్యాకర్లు గుర్తించారని వివరించింది. కోవిడ్‌ –19 వ్యాక్సిన్‌ విషయంలో భారతీయ ఫార్మా ఆధిపత్యాన్ని తగ్గించే లక్ష్యంతో చైనా బృందం ఈ హ్యాకింగ్‌కు పాల్పడుతోందని పేర్కొంది. సైఫర్మా సంస్థకు సింగపూర్, టోక్యోల్లో కార్యాలయాలు ఉన్నాయి.

పవర్‌ గ్రిడ్‌ వ్యవస్థపై కూడా...
భారత్, చైనాల మధ్య సరిహద్దు ఉద్రిక్తతలు తీవ్రంగా ఉన్న సమయంలో భారత్‌లో కీలకమైన పవర్‌ గ్రిడ్‌ వ్యవస్థను మాల్‌వేర్‌తో చైనా హ్యాకర్ల బృందం ‘రెడ్‌ఎకో’ లక్ష్యంగా చేసుకుందని అమెరికాకు చెందిన రికార్డెడ్‌ ఫ్యూచర్‌ సంస్థ తెలిపింది. 2020, అక్టోబర్‌ 12న ముంబైలో అకస్మాత్తుగా విద్యుత్‌ సరఫరాకు ఆటంకం ఏర్పడడంతో రైళ్ల రాకపోకలు నిలిచిపోవడం, గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డ విషయం తెలిసిందే.

క్విక్‌ రివ్యూ
:
ఏమిటి : భారత ఫార్మా కంపెనీలపై చైనా హ్యాకర్ల దాడి
ఎప్పుడు : మార్చి 1
ఎవరు : సైఫర్మా
ఎందుకు : కోవిడ్‌ –19 వ్యాక్సిన్‌ విషయంలో భారతీయ ఫార్మా ఆధిపత్యాన్ని తగ్గించే లక్ష్యంతో
Published date : 02 Mar 2021 06:09PM

Photo Stories