Skip to main content

భారత ప్రధానిగా మోదీనే అత్యుత్తమం

ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి తిరుగులేని ప్రజాదరణ ఉందని మరోసారి తేలింది.
Current Affairs
ప్రధానిగా మోదీనే అత్యుత్తమం అని ‘ఇండియా టుడే – కార్వీ ఇన్ సైట్స్‌ మూడ్‌ ఆఫ్‌ ది నేషన్’ సర్వే తాజాగా తేల్చింది. ప్రధానిగా మోదీ పనితీరు అద్భుతంగా ఉందని సర్వేలో పాల్గొన్నవారిలో 30 శాతం మంది, బావుందని 48 శాతం, సాధారణంగా ఉందని 17 శాతం అభిప్రాయపడ్డారు. 5 శాతం మంది మాత్రం మోదీ పనితీరు బాగాలేదన్నారు. ఫిబ్రవరి 2016 – ఆగస్టు 2020 మధ్య నిర్వహించిన 10 సర్వేలను పోలిస్తే.. మోదీకి ప్రజాదరణ గణనీయంగా పెరగడం స్పష్టంగా కనిపిస్తోంది.

సర్వేలోని ముఖ్యాంశాలు
  • మోదీ ప్రజాదరణ గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌ ప్రాంతాల్లో అత్యధికంగా(4 పాయింట్‌ స్కేల్‌పై3.14గా) ఉంది.
  • మోదీ ప్రజాదరణ ప్రాంతాల వారీగా చూస్తే ఉత్తర భారతంలో 4 పాయింట్‌ స్కేల్‌పై3.01గా, తూర్పు భారత్‌లో 3.02గా, దక్షిణ భారతంలో 2.99గా ఉంది.
  • మతాల వారీగా చూస్తే హిందువుల్లో 3.13, ముస్లింల్లో2.33 గా మోదీపై ప్రజాదరణ ఉంది. - కులాలవారీగా మోదీ ఓబీసీ, ఎంబీసీల్లో అత్యధికంగా 3.08, దళితుల్లో 3.01, అగ్రవర్ణాల్లో 2.99 స్కోరు సాధించారు.
  • ప్రతిపక్షంగా కాంగ్రెస్‌ పనితీరు చాలా బావుందని కేవలం 9 శాతం మంది అభిప్రాయపడగా, బావుందని 35 శాతం, సాధారణమని 32 శాతం, బాగాలేదని21 శాతం మంది తెలిపారు.
  • మోదీ ప్రభుత్వ అతిపెద్ద విజయం జమ్మూకశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్‌ 370 రద్దు అని16 శాతం మంది అభిప్రాయపడ్డారు.
  • కరోనాను సరిగ్గా నియంత్రించలేకపోవడంమోదీ ప్రభుత్వ అతిపెద్ద వైఫల్యమని 25 శాతం, నిరుద్యోగమని 23 శాతం, వలస కార్మికుల సంక్షోభమని 14 శాతం మంది తెలిపారు.
  • తూర్పు లద్దాఖ్‌లో చైనాకు సరైన గుణపాఠం చెప్పిందని 69 శాతం మంది తెలిపారు.
  • చైనా వస్తువుల బహిష్కరణకు 90 శాతం మంది మద్దతు పలికారు.
  • పౌరసత్వ సవరణ చట్టానికి మద్దతిస్తామని 50 శాతం మంది స్పష్టం చేశారు.

బెస్ట్‌ పీఎంమోదీయే..

అత్యుత్తమ భారత ప్రధాని ఎవరన్న ప్రశ్నకు.. 44 శాతం మోదీకి, 14 శాతం వాజ్‌పేయికి, 12 శాతం ఇందిరా గాంధీకి, 7 శాతం నెహ్రూకి, 7 శాతం మంది మన్మోహన్ కు ఓటేశారు. తదుపరి ప్రధానిగా 66 శాతం మోదీనే ఎన్నుకున్నారు. 8 శాతం రాహుల్‌కి, 5 శాతం సోనియాకి, 4 శాతం అమిత్‌షాకుఓటేశారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి : భారత ప్రధానిగా మోదీనే అత్యుత్తమం
ఎప్పుడు : ఆగస్టు 8
ఎవరు : ఇండియా టుడే – కార్వీ ఇన్ సైట్స్‌ మూడ్‌ ఆఫ్‌ ది నేషన్సర్వే
Published date : 10 Aug 2020 05:53PM

Photo Stories