Skip to main content

భారత ప్రభుత్వం ప్రారంభించిన టాయ్‌కథాన్ కార్యక్రమం ఉద్దేశం?

భారతీయ సంస్కృతి, విలువలను పరిచయం చేసే గేమ్స్, వినూత్నమైన ఆట వస్తువుల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ‘టాయ్‌కథాన్-2021’ పేరుతో జనవరి 5న కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించింది.
Current Affairsవిద్యార్థులు, ఉపాధ్యాయులు, నిపుణులు, స్టార్టప్‌లు కలసి తమ ఆలోచనలను పంచుకోవడం ద్వారా వినూత్నమైన ఆట బొమ్మలు, గేమ్స్ రూపకల్పనకు వీలు కల్పించే కార్యక్రమమే టాయ్‌కథాన్.

భారత ఆట వస్తువుల మార్కెట్ బిలియన్ డాలర్లు ఉంటుందని, దురదృష్టవశాత్తూ 80 శాతం ఆటబొమ్మలు దిగుమతి చేసుకుంటున్నవే ఉంటున్నాయని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ పేర్కొన్నారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి : టాయ్‌కథాన్-2021 పేరుతో కొత్త కార్యక్రమం ప్రారంభం
ఎప్పుడు : జనవరి 5
ఎవరు : కేంద్ర ప్రభుత్వం
ఎందుకు : భారతీయ సంస్కృతి, విలువలను పరిచయం చేసే గేమ్స్, వినూత్నమైన ఆట వస్తువుల అభివృద్ధి కోసం
Published date : 06 Jan 2021 06:50PM

Photo Stories