భారత పైలట్ వర్ధమాన్ విడుదల
Sakshi Education
పాకిస్తాన్ అరెస్ట్ చేసిన భారత వాయుసేన(ఐఏఎఫ్) పైలట్, వింగ్ కమాండర్ వర్ధమాన్ అభినందన్ను మార్చి 1న విడుదల చేయనున్నట్లు పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ఫిబ్రవరి 28న ప్రకటించారు.
పాక్‌లోని బాలాకోట్‌లో ఉన్న జైషే మొహమ్మద్ ఉగ్రవాదుల స్థావరంపై భారత్ఫిబ్రవరి 26న వైమానిక దాడులు చేసిన సంగతి తెలిసిందే.దీంతో పాక్ యుద్ధ విమానాలు భారత గగనతలంలోకి ప్రవేశించాయి. ఈ సందర్భంగా పాక్‌కు చెందిన ఎఫ్-16 యుద్ధ విమానాన్ని భారత్ నేలకూల్చగా, ఇండియాకు చెందిన రెండు ఫైటర్ జెట్లను కూల్చేశామనీ, వర్ధమాన్ అభినందన్ అనే పైలట్‌ను అరెస్ట్ చేశామని పాకిస్తాన్ ప్రకటించుకుంది. వర్ధమాన్ అరెస్టును ధ్రువీకరించిన భారత విదేశాంగ శాఖ.. జెనీవా నిబంధనల ప్రకారం అభినందన్ విషయంలో మానవతాదృక్పథంతో వ్యవహరించాలనీ, ఆయన్ను సురక్షితంగా విడిచిపెట్టాలని డిమాండ్ చేసింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : భారత పైలట్ వర్ధమాన్ విడుదల
ఎప్పుడు : ఫిబ్రవరి 28
ఎవరు : పాకిస్తాన్
క్విక్ రివ్యూ :
ఏమిటి : భారత పైలట్ వర్ధమాన్ విడుదల
ఎప్పుడు : ఫిబ్రవరి 28
ఎవరు : పాకిస్తాన్
Published date : 01 Mar 2019 05:44PM