భారత్, పాక్ మహిళల టి20 మ్యాచ్ రద్దు
Sakshi Education
మహిళల టి20 ప్రపంచ కప్ సన్నాహాల్లో భాగంగా జరగాల్సిన భారత్, పాకిస్తాన్ టి20 ప్రాక్టీస్ మ్యాచ్ రద్దరుుంది.
ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్‌లోని అలెన్ బోర్డర్ ఫీల్డ్ మైదానంలో ఫిబ్రవరి 16న జరగాల్సిన ఈ మ్యాచ్ వర్షం కారణంతో ఒక్క బంతి కూడా పడకుండానే తుడిచిపెట్టుకుపోరుుంది. భారీ వర్షం ఎంతకీ తగ్గక పోవడంతో అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. భారత్ తన తదుపరి ప్రాక్టీస్ మ్యాచ్‌ను ఫిబ్రవరి 18న వెస్టిండీస్‌తో ఆడుతుంది. భారత్-పాక్ మ్యాచ్‌తో పాటు ఆస్ట్రేలియా-వెస్టిండీస్, బంగ్లాదేశ్-థాయ్‌లాండ్ మ్యాచ్‌లు కూడా వర్షం కారణంగా జరగలేదు. ఫిబ్రవరి 21న భారత్, డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియా మధ్య జరిగే మ్యాచ్‌తో పొట్టి ప్రపంచ కప్‌కు తెరలేవనుంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : భారత్, పాక్ మహిళల టి20 మ్యాచ్ రద్దు
ఎప్పుడు : ఫిబ్రవరి 16
ఎక్కడ : బ్రిస్బేన్, ఆస్ట్రేలియా
ఎందుకు : వర్షం కారణంగా
క్విక్ రివ్యూ :
ఏమిటి : భారత్, పాక్ మహిళల టి20 మ్యాచ్ రద్దు
ఎప్పుడు : ఫిబ్రవరి 16
ఎక్కడ : బ్రిస్బేన్, ఆస్ట్రేలియా
ఎందుకు : వర్షం కారణంగా
Published date : 17 Feb 2020 06:02PM