Skip to main content

భారత మాజీ క్రికెటర్ సదాశివ్ పాటిల్ కన్నుమూత

భారత మాజీ క్రికెటర్ సదాశివ్ రావ్‌జీ (ఎస్‌ఆర్) పాటిల్(86) కన్నుమూశారు.
Current Affairs
సెప్టెంబర్ 15న ఆయన కొల్హాపూర్(మహారాష్ట్ర)లోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. మీడియం పేసర్ అయిన పాటిల్... 1955లో న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించారు. భారత్ తరఫున టెస్టు మ్యాచ్ ఆడిన 79వ ఆటగాడిగా నిలిచిన ఆయన... కేవలం ఒకే ఒక టెస్టు మ్యాచ్‌కు పరిమితం అయ్యారు. అనంతరం లాంక్‌షైర్ లీగ్‌లో 1959 నుంచి 1961 వరకు రెండు సీజన్‌ల్లో 52 మ్యాచ్‌ల్లో ఆడి... 111 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. 1952-64 మధ్య మహారాష్ట్ర తరఫున 36 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడాడు. రంజీల్లో మహారాష్ట్రకు సారథ్యం కూడా వహించాడు.

థామస్ కప్-ఉబెర్ కప్ టోర్నీ వాయిదా
ప్రతిష్టాత్మక థామస్ కప్-ఉబెర్ కప్ టీమ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌ను 2021 ఏడాదికి వాయిదా వేస్తున్నట్లు ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) వెల్లడించింది. కరోనా వైరస్ భయానికి ఈ టోర్నీలో ఆడబోమని చెప్పే దేశాల సంఖ్య పెరగడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. ముందనుకున్న షెడ్యూల్ ప్రకారం 2020, అక్టోబర్ 3 నుంచి 11 వరకు డెన్మార్క్‌లోని అర్హస్‌లో ఈ టోర్నీ జరగాల్సి ఉంది.

క్విక్ రివ్యూ :

ఏమిటి : భారత మాజీ క్రికెటర్ కన్నుమూత
ఎప్పుడు : సెప్టెంబర్ 15
ఎవరు : సదాశివ్ రావ్‌జీ (ఎస్‌ఆర్) పాటిల్(86)
ఎక్కడ : కొల్హాపూర్, మహారాష్ట్ర
Published date : 16 Sep 2020 05:34PM

Photo Stories