భారత క్షీణ రేటు అంచనా 10.6 శాతం: మూడీస్
Sakshi Education
కరోనా ప్రేరిత సవాళ్ల నేపథ్యంలో 2020 ఏప్రిల్-2021 మార్చి మధ్య భారత్ ఆర్థిక వ్యవస్థ 11.5 శాతం క్షీణిస్తుందన్న తన తొలి అంచనాలను మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ నవంబర్ 19న మైనస్ 10.6 శాతానికి తగ్గించింది.
తయారీ రంగానికి, ఉపాధి కల్పనకు కేంద్ర ప్రభుత్వ ఉద్దీపన చర్యలు దోహదపడతాయని మూడీస్ తెలిపింది. 2021-22లో భారత్ వృద్ధి రేటు 10.8 శాతంగా ఉంటుందని భావిస్తున్నట్లు తెలిపింది. ఇంతక్రితం ఈ అంచనా 10.6 శాతం.
పలు సంస్థల అంచనాలు ఇలా...
కరోనా కల్లోల పరిస్థితులతో 2020-21 ఆర్థిక ఏడాది మొదటి త్రైమాసికం భారత్ ఆర్థిక వ్యవస్థ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) 23.9 శాతం క్షీణ రేటును నమోదు చేసుకుంది. ఈ నేపథ్యంలో... ఇప్పటికే పలు ఆర్థిక, రేటింగ్ సంస్థలు 2020-21లో భారత్ ఆర్థిక వ్యవస్థ క్షీణ రేటు 8 శాతం నుంచి 11 శాతం వరకూ ఉంటుందని అంచనావేశాయి.
ఆయా అంచనాలను పరిశీలిస్తే (శాతాల్లో)

సంస్థ | క్షీణత అంచనా |
కేర్ | 8.2 |
యూబీఎస్ | 8.6 |
ఎస్‌అండ్‌పీ | 9 |
ఆసియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ | 9 |
ఆర్‌బీఐ | 9.5 |
ప్రపంచబ్యాంక్ | 9.6 |
ఫిచ్ | 10.5 |
ఎస్‌బీఐ ఎకోర్యాప్ | 10.9 |
ఇక్రా | 11 |
ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ | 11.8 |
ఐఎంఎఫ్ | 10.3 |
గోల్డ్‌మన్ శాక్స్ | 10.3 |
Published date : 20 Nov 2020 05:54PM