భారత క్రికెట్ జట్లకు కిట్స్, అపెరాల్ స్పాన్సర్‌గా వ్యవహరించనున్న సంస్థ?
Sakshi Education
బెంగళూరుకు చెందిన ఈ-గేమింగ్ సంస్థ మొబైల్ ప్రీమియర్ లీగ్ (ఎంపీఎల్) భారత క్రికెట్ జట్లకు (పురుషులు, మహిళలు) కిట్స్, అపెరాల్ స్పాన్సర్‌గా వ్యవహరించనుంది.
ఈ మేరకు నవంబర్ 2న ఎంపీఎల్‌తో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందం ప్రకారం... 2020 నవంబర్ నుంచి 2023 డిసెంబర్ వరకు ఎంపీఎల్ భారత జట్లకు కిట్ స్పాన్సర్‌గా ఉండనుంది. ఒప్పందం విలువ మొత్తం రూ. 120 కోట్లు అని సమాచారం. ఒప్పందంలో భాగంగా భారత్ ఆడే ప్రతి మ్యాచ్‌కు ఎంపీఎల్ రూ. 65 లక్షలు బీసీసీఐకి చెల్లించనుంది.
ఎన్నో ఏళ్ల పాటు భారత జట్లకు అంతర్జాతీయ బ్రాండింగ్ ‘నైకీ’ కిట్స్, అపెరాల్ స్పాన్సర్‌గా వ్యవహరించింది. అయితే ఈ ఏడాది ఒప్పంద గడువు ముగియడంతో ప్రముఖ సంస్థ నైకీ పునరుద్ధరించుకోలేదు. దీంతో గాలక్టస్ ఫన్‌వేర్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన ఎంపీఎల్‌తో బీసీసీఐ ఒప్పందం చేసుకుంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : భారత క్రికెట్ జట్లకు (పురుషులు, మహిళలు) కిట్స్, అపెరాల్ స్పాన్సర్‌గా వ్యవహరించనున్న సంస్థ
ఎప్పుడు : నవంబర్ 2
ఎవరు : మొబైల్ ప్రీమియర్ లీగ్ (ఎంపీఎల్)

Published date : 03 Nov 2020 05:58PM