భారత క్రీడాకారుడు సజన్ ప్రకాశ్ ఏ క్రీడకు చెందినవాడు?
Sakshi Education
ఉజ్బెకిస్తాన్ ఓపెన్ అంతర్జాతీయ స్విమ్మింగ్ టోర్నమెంట్‌లో భారత స్విమ్మర్లు పతకాల పంట పండించారు.
టోర్నీ రెండో రోజు ఏప్రిల్ 14న భారత్‌కు ఏకంగా పది పతకాలు లభించాయి. ఉజ్బెకిస్తాన్ రాజధాని నగరం తాష్కెంట్‌లో ఈ టోర్ని జరుగుతోంది.
పతకాల విజేతలు...
పతకాల విజేతలు...
- పురుషుల 200 మీటర్ల ఫ్రీస్టయిల్‌లో సజన్ ప్రకాశ్ 1ని:50.74 సెకన్ల సమయంతో విజేతగా నిలిచి స్వర్ణ పతకాన్ని సాధించాడు. తనీష్ జార్జికి కాంస్యం దక్కింది.
- మహిళల 200 మీటర్ల ఫ్రీస్టయిల్‌లో కెనిషా గుప్తా స్వర్ణం, శివాని కటారియా రజతం గెలిచారు.
- పురుషుల 50 మీటర్ల బ్రెస్ట్‌స్ట్రోక్ ఈవెంట్‌లో ఎస్‌పీ లిఖిత్, ధనుష్ రజత, కాంస్య పతకాలు నెగ్గారు. మహిళల ఇదే ఈవెంట్‌లో చాహత్ అరోరా... బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది.
- మహిళల 50 మీటర్ల బటర్‌ఫ్లయ్ ఈవెంట్‌లో దివ్య స్వర్ణం సాధించగా... పురుషుల విభాగంలో ఆదిత్య రజతం గెలిచాడు.
- మహిళల 200 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్ ఈవెంట్‌లో సువన పసిడి పతకాన్ని సొంతం చేసుకుంది.
Published date : 16 Apr 2021 04:17PM