భారత జీడీపీ వృద్ధి రేటుకు ఫిచ్ కోత
Sakshi Education
భారత జీడీపీ వృద్ధి రేటు అంచనాలను ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2019-20) గతంలో వేసిన 6.8 శాతం నుంచి 6.6 శాతానికి రేటింగ్ ఏజెన్సీ ఫిచ్ తగ్గించింది.
ఈ మేరకు సెప్టెంబర్ 10న ఒక నివేదికను విడుదల చేసింది. అధిక రుణ భారం కారణంగా ద్రవ్య విధానాన్ని సడలించే అవకాశాలు ప్రభుత్వానికి పరిమితంగానే ఉన్నాయని ఫిచ్ తన నివేదికలో అభిప్రాయపడింది.
ఫిచ్ నివేదికలోని అంశాలు..
క్విక్ రివ్యూ :
ఏమిటి : 2019-20లో భారత జీడీపీ వృద్ధి రేటు 6.6 శాతామే
ఎప్పుడు : సెప్టెంబర్ 10
ఎవరు : రేటింగ్ ఏజెన్సీ ఫిచ్
ఫిచ్ నివేదికలోని అంశాలు..
- రానున్న సంవత్సరంలో భారత జీడీపీ 7.1 శాతానికి పుంజుకునే అవకాశం ఉంది.
- భారత రేటింగ్‌ను మార్పు చేయకుండా బీబీబీ మైనస్, స్థిరమైన దృక్పథాన్నే కొనసాగించాం.
- భారత జీడీపీ వృద్ధి వరుసగా ఐదో త్రైమాసిక కాలంలోనూ (ఏప్రిల్-జూన్) 5 శాతానికి తగ్గింది.
- ప్రైవేటు వినియోగం, ఇన్వెస్ట్‌మెంట్ బలహీనంగా ఉన్నాయి. అంతర్జాతీయ వాణిజ్య వాతావరణం కూడా బలహీనంగానే ఉంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : 2019-20లో భారత జీడీపీ వృద్ధి రేటు 6.6 శాతామే
ఎప్పుడు : సెప్టెంబర్ 10
ఎవరు : రేటింగ్ ఏజెన్సీ ఫిచ్
Published date : 11 Sep 2019 05:16PM