భారత హాకీ దిగ్గజం ద్యాన్‌చంద్‌పై తీయనున్న సినిమా పేరు?
‘ధ్యాన్‌చంద్’ పేరుతో బాలీవుడ్ డెరైక్టర్ అభిషేక్ చౌబే ఈ సినిమా తీయనున్నారు. ఈ విషయాన్ని డిసెంబర్ 15న డెరైక్టర్ చౌబే ప్రకటించారు. అయితే తెరపై ధ్యాన్‌చంద్‌గా ఎవరు నటించనున్నారన్నది తెలియాల్సి ఉంది. ధ్యాన్‌చంద్ జయంతి రోజైన ఆగస్టు 29న జాతీయ క్రీడా దినోత్సవంను నిర్వహిస్తారు.
దర్శకుడు చౌబే తెలిపిన వివరాల ప్రకారం... ఆర్‌ఎస్‌వీపీ మూవీస్, బ్లూ మంకీ ఫిల్మ్స్ సంయుక్తంగా ధ్యాన్‌చంద్ చిత్రనిర్మాణం చేపట్టాయి. 2022 ఏడాదిలో ఈ సినిమా విడుదల కానుంది. భారత హాకీ చరిత్రనే ‘స్వర్ణ’ అక్షరాలతో లిఖించిన మూడు ఒలింపిక్స్ (1928-అమ్‌స్టర్‌డామ్), (1932 -లాస్‌ఏంజెలిస్), (1936- బెర్లిన్) ప్రదర్శనలను ఈ చిత్రంలో చూపించనున్నారు.
మంచి సందర్భం: 2020 జాతీయ క్రీడా పురస్కారాలు-సమగ్ర సమాచారం
క్విక్ రివ్యూ :
ఏమిటి : ధ్యాన్‌చంద్ పేరుతో సినిమా రూపకల్పన
ఎప్పుడు : డిసెంబర్ 15
ఎవరు : బాలీవుడ్ డెరైక్టర్ అభిషేక్ చౌబే
ఎందుకు : హాకీ దిగ్గజం మేజర్ ధ్యాన్‌చంద్ జీవితాన్ని తెరకెక్కించేందుకు