భారత్, చైనా రక్షణ మంత్రుల సమావేశం
Sakshi Education
సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తీవ్రమైన నేపథ్యంలో భారత, చైనా రక్షణ మంత్రుల మధ్య కీలక భేటీ జరిగింది.
రష్యా రాజధాని మాస్కోలో సెప్టెంబర్ 4న భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్, చైనా రక్షణ మంత్రి వీ ఫెన్‌ఘీ సమావేశమయ్యారు. ఈ సమావేశాన్ని సరిహద్దుల్లో ఉద్రిక్తతలను తొలగించే దిశగా చోటు చేసుకున్న కీలక ముందడుగుగా భావిస్తున్నారు. తూర్పు లద్దాఖ్‌లోని సరిహద్దుల్లో 2020, మే నెలలో తీవ్రస్థాయి ఉద్రిక్తతలు ప్రారంభమైన తరువాత ఇరు దేశాల మధ్య కీలక మంత్రిత్వ స్థాయి ముఖాముఖి చర్చలు జరగడం ఇదే ప్రథమం.గతంలో విదేశాంగ మంత్రి జై శంకర్ చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యితో ఫోన్‌లో చర్చించారు. కానీ, వారిద్దరి మధ్య ముఖాముఖీ భేటీ జరగలేదు.ఎస్‌సీఓ రక్షణ మంత్రుల సమావేశంలో పాల్గొనేందుకు రాజ్‌నాథ్, వీ ఫెన్‌ఘీ రష్యాకు వెళ్లిన విషయం తెలిసిందే.
మరో దఫా మిలిటరీ చర్చలు
భారత్- చైనాల మధ్య మరోదఫా మిలిటరీ చర్చలు జరిగాయి. సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తగ్గించడానికి తూర్పు లద్దాఖ్‌లోని చుషుల్‌లో సెప్టెంబర్ 4న బ్రిగేడ్ కమాండర్ స్థాయి చర్చలు జరిగాయి. చర్చల్లో పురోగతి ఏంటనేది వెంటనే తెలియరాలేదు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : భారత్, చైనా రక్షణ మంత్రుల సమావేశం
ఎప్పుడు : సెప్టెంబర్ 4
ఎవరు : భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్, చైనా రక్షణ మంత్రి వీ ఫెన్‌ఘీ
ఎక్కడ : మాస్కో, రష్యా
ఎందుకు : సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తీవ్రమైన నేపథ్యంలో...

Published date : 05 Sep 2020 05:19PM