భారత్-చైనా అత్యున్నత సమావేశంలో జై శంకర్
Sakshi Education
చైనా రాజధాని బీజింగ్‌లో ఆగస్టు 12న జరిగిన భారత్-చైనా అత్యున్నత కమిటీ(సాంస్కృతిక, ప్రజా సంబంధాలు) సమావేశంలో భారత విదేశాంగ మంత్రి ఎస్.జై శంకర్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా చైనా ఉపాధ్యక్షుడు వాంగ్ క్విషన్, విదేశాంగ మంత్రి వాంగ్ యీతో జై శంకర్ భేటీ అయ్యారు. ఈ భేటీలో జై శంకర్ మాట్లాడుతూ... భారత్, చైనా మధ్య ఉండే భిన్నాభిప్రాయాలు ఘర్షణగా మారకూడదని తెలిపారు. ఓ దేశపు సమస్యలపై మరో దేశం ఎలా స్పందిస్తుందన్న విషయంపైనే భవిష్యత్తులో ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలు ఆధారపడి ఉంటాయని స్పష్టం చేశారు.
భారత్-చైనా అత్యున్నత కమిటీ(సాంస్కృతిక, ప్రజా సంబంధాలు) సమావేశం సందర్భంగా భారత్, చైనా నాలుగు ఒప్పందాలు కదుర్చుకున్నాయి. సాంస్కృతిక, ప్రజా సంబంధాలు బలోపేతానికి దోహదపడే ఈ ఒప్పందాలపై భారత విదేశాంగ మంత్రి జై శంకర్, చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ సంతకాలు చేశారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : భారత్-చైనా అత్యున్నత కమిటీ(సాంస్కృతిక, ప్రజా సంబంధాలు) సమావేశం
ఎప్పుడు : ఆగస్టు 12
ఎవరు : భారత విదేశాంగ మంత్రి ఎస్.జై శంకర్
ఎక్కడ : బీజింగ్, చైనా

Published date : 13 Aug 2019 05:24PM