భారత బ్యాంకింగ్‌పై ఎన్‌పీఏ భారం ఎంత శాతం?
Sakshi Education
భారత్ బ్యాంకింగ్‌పై మొండిబకాయిల (ఎన్‌పీఏ) భారం 2020 సెప్టెంబర్ నాటికి 7.5 శాతంగా ఉంది.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) జనవరి 11న విడుదల చేసిన ద్వైవార్షిక ద్రవ్య స్థిరత్వ నివేదిక (ఎఫ్‌ఎస్‌ఆర్) నివేదికలో ఈ విషయం వెల్లడైంది.
ఎఫ్‌ఎస్‌ఆర్‌లోని ముఖ్యాంశాలు
- కోవిడ్-19 ప్రేరిత సవాళ్ల నేపథ్యంలో భారత్ బ్యాంకింగ్‌పై ఎన్‌పీఏల భారం తీవ్రతరం కానుంది.
- మొత్తం రుణాల్లో మొండిబకాయిల భారం 2021, సెప్టెంబర్ నాటికి 13.5 శాతానికి చేరనుంది. ప్రభావం తీవ్రంగా ఉంటే 14.8 శాతానికి ఎగసే అవకాశం ఉంది.
- ఇదే జరిగితే గడచిన 25 సంవత్సరాల్లో ఎన్నడూ లేనంత తీవ్ర మొండిబకాయిల భారం బ్యాంకింగ్‌పై ఉంటుంది.
- 1996-1997లో బ్యాంకింగ్‌పై ఎన్‌పీఏ భారం 15.7 శాతం నమోదైంది.
Published date : 13 Jan 2021 01:08PM