భారత్ అథ్లెటిక్స్ కోచ్ నికొలాయ్ కన్నుమూత
బెలారస్కు చెందిన 72 ఏళ్ల స్నెసరెవ్... పాటియాలాలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ (ఎన్‌ఐఎస్)లోని తన హాస్టల్ గదిలో శవమై తేలారు. మృతికి కారణాలు ఇంకా తెలియలేదు. 3000 మీటర్ల స్టీపుల్‌ఛేజ్ విభాగంలో టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన అవినాశ్ సాబ్లేతో పాటు ఇతర మిడిల్, లాంగ్ డిస్టెన్స్ రన్నర్లకు ఆయన శిక్షణ ఇస్తున్నారు.
2005లో తొలిసారి భారత కోచ్‌గా స్నెసరెవ్ బాధ్యతలు చేపట్టారు. అయితే భారత అథ్లెటిక్స్ సమాఖ్యతో విభేదాలతో 2019 ఫిబ్రవరిలో తన పదవికి రాజీనామా చేశారు. తర్వాత రెండేళ్ల తర్వాత ఇప్పుడు మళ్లీ కోచ్‌గా నియమించడంతో మార్చి 2వ తేదీనే భారత్‌కు వచ్చారు.
బెలారస్ రాజధాని: మిన్‌స్క్; కరెన్సీ: బెలారసియన్ రూబుల్
బెలారస్ ప్రస్తుత అధ్యక్షుడు: అలెగ్జాండర్ లుకాషెంకో
బెలారస్ ప్రస్తుత ప్రధానమంత్రి: రోమన్ గోలోవ్చెంకో
క్విక్ రివ్యూ :
ఏమిటి : భారత్ అథ్లెటిక్స్ (మిడిల్ అండ్ లాంగ్ డిస్టెన్స్) కోచ్ కన్నుమూత
ఎప్పుడు : మార్చి 5
ఎవరు : నికొలాయ్ స్నెసరెవ్
ఎక్కడ : నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ (ఎన్‌ఐఎస్), పాటియాలా, పంజాబ్