భారత ఆర్మీ చీఫ్‌కు నేపాల్ సైనిక గౌరవ జనరల్‌గా గౌరవ పురస్కారం
నేపాల్ రాజధాని ఖాట్మండూలో అధ్యక్ష భవనం శీతల్ నివాస్లో నవంబర్ 6న జరిగిన కార్యక్రమంలో జనరల్ నరవాణేకు నేపాల్ అధ్యక్షురాలు విద్యా దేవి భండారి ఖడ్గాన్ని బహుకరించి నేపాల్ సైనిక గౌరవ జనరల్‌గా గౌరవ పురస్కారం ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలి, భారత రాయబారి వినయ్ ఎం. క్వాత్రా పాల్గొన్నారు. 1950లో మొదటిసారి భారత సైన్యం ’కమాండర్ ఇన్ చీఫ్’ జనరల్ కేఎం కరియప్పకు తొలిసారి నేపాల్ గౌరవ జనరల్ హోదా ఇవ్వగా.. అప్పటి నుంచి ఈ సంప్రదాయం కొనసాగుతోంది.
చదవండి: భారత్‌లోని ఏ మూడు ప్రాంతాలను తమ భూభాగంలో భాగంగా చూపిస్తూ నేపాల్ కొత్త మ్యాప్‌ను రూపొందించింది?
క్విక్ రివ్యూ :
ఏమిటి : భారత ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ ముకుంద్ నరవాణేకు నేపాల్ సైనిక గౌరవ జనరల్‌గా గౌరవ పురస్కారం ప్రదానం
ఎప్పుడు : నవంబర్ 6
ఎవరు : నేపాల్ అధ్యక్షురాలు విద్యా దేవి భండారి
ఎక్కడ : శీతల్ నివాస్, ఖాట్మాండు, నేపాల్