Skip to main content

భారత్ అమెరికా రక్షణ సదస్సు ప్రారంభం

భారత్ అమెరికా రక్షణ సంబంధాలపై హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న అంతర్జాతీయ సదస్సు డిసెంబర్ 18న ప్రారంభమైంది.
Current Affairsరెండ్రోజుల పాటు జరిగే ఈ సదస్సును అంతర్జాతీయ బిజినెస్ కౌన్సిల్, భారతీయ పరిశ్రమల సమాఖ్య (సీఐఐ), యూఎస్ రాయబార కార్యాలయం సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. ఈ సదస్సుకు తెలంగాణ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు, కార్యదర్శి జయేశ్ రంజన్, కేంద్ర రక్షణ రంగ ఉత్పత్తుల శాఖ సంయుక్త కార్యదర్శి సంజయ్ జాజు, యూఎస్ రాజకీయ-రక్షణ వ్యవహారాల విభాగం డిప్యూటీ అసిస్టెంట్ సెక్రటరీ జోయల్ స్టార్, హైదరాబాద్‌లో యూఎస్ కాన్సుల్ జనరల్ జోయల్ రీఫ్‌మాన్ హాజరయ్యారు.

సదస్సులో కేటీఆర్ మాట్లాడుతూ... తెలంగాణ లాంటి వేగంగా పురోగమిస్తున్న రాష్ట్రాలను నేరుగా సంప్రదిస్తే అమెరికా పెట్టుబడి సంస్థలు స్థానికంగా ఎదుర్కొనే అవాంతరాల పరిష్కారం దిశగా చొరవ తీసుకుంటామని చెప్పారు. భారత్‌లో ఎయిరోస్పేస్, డిఫెన్స్ రంగాల వాటా రూ.1.13 లక్షల కోట్లు కాగా, ఇది మరింత పెరగాల్సిన అవసరం ఉందన్నారు. అమెరికా అధ్యక్షుడు ప్రయాణించే సికోర్క్సీ హెలికాప్టర్‌తో పాటు, ఎఫ్ 16 యుద్ధ విమానాల రెక్కలు హైదరాబాద్‌లోనే తయారవుతున్నాయని పేర్కొన్నారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
భారత్ అమెరికా రక్షణ సదస్సు ప్రారంభం
ఎప్పుడు : డిసెంబర్ 18
ఎక్కడ : హైదరాబాద్
Published date : 19 Dec 2019 05:57PM

Photo Stories