భారత్, అమెరికా రక్షణ మంత్రుల సమావేశం ఎక్కడ జరిగింది?
Sakshi Education
భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ అస్టిన్ భేటీ అయ్యారు.
న్యూఢిల్లీలో మార్చి 20న జరిగిన ఈ సమావేశంలో భారత్, అమెరికా దేశాల మధ్య రక్షణ సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని ఇరు దేశాల నేతలు తీర్మానించారు. భారత సైన్యం, అమెరికాకు చెందిన ఇండో–పసిఫిక్ కమాండ్, సెంట్రల్ కమాండ్, ఆఫ్రికా కమాండ్ మధ్య సహకారం పెంచుకోవాలని నిర్ణయించుకున్నట్లు రాజ్‌నాథ్ తెలిపారు. తూర్పు లద్దాఖ్‌లో చైనా సాగిస్తున్న ఆగడాలు కూడా తమ మధ్య చర్చకు వచ్చాయన్నారు.
30 ప్రిడేటర్ డ్రోన్లు కొనుగోలు
త్రివిధ దళాల అవసరాల కోసం అమెరికా నుంచి 3 బిలియన్ డాలర్ల విలువైన 30 మల్టీ–మిషన్ ఆర్మ్‌డ్ ప్రిడేటర్ డ్రోన్లు కొనుగోలు చేయాలని భారత్ నిర్ణయించింది. మీడియం–ఆల్టిట్యూడ్ లాండ్ ఎండ్యురెన్స్ (ఎంఏఎల్‌ఈ) ప్రిడేటర్–బి డ్రోన్లుగా పిలిచే ఈ డ్రోన్లు ఏకంగా 35 గంటలపాటు గాలిలో సంచరించగలవు. భూమిపై, సముద్రంపై ఉన్న లక్ష్యాలను వేటాడే సామర్థ్యం వీటి సొంతం. దీనిపై రాజ్‌నాథ్, లాయిడ్ చర్చించినట్లు సమాచారం.
క్విక్ రివ్యూ :
ఏమిటి : భారత్, అమెరికా రక్షణ మంత్రుల సమావేశం
ఎప్పుడు : మార్చి 20
ఎవరు : రాజ్‌నాథ్ సింగ్, లాయిడ్ అస్టిన్
ఎక్కడ : న్యూఢిల్లీ
ఎందుకు : రక్షణ సంబంధాలపై చర్చలు జరిపేందుకు

Published date : 22 Mar 2021 05:54PM