భారత 72వ గణతంత్ర దినోత్సవ వేడుకలు
Sakshi Education
భారతదేశ 72వ గణతంత్ర దినోత్సవ వేడుకలు జనవరి 26న దేశవ్యాప్తంగా ఘనంగా జరిగాయి.
ఎర్రకోట ముట్టడి
నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దాదాపు గత రెండు నెలలుగా ఢిల్లీ సరిహద్దుల్లో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న రైతులు జనవరి 26న ఢిల్లీలోకి అడుగుపెట్టారు. రోడ్లపై అడ్డుగా పెట్టిన బారికేడ్లను ధ్వంసం చేస్తూ ట్రాక్టర్లతో ఎర్రకోటను ముట్టడించారు. ఏటా స్వాతంత్య్ర దినోత్సవం రోజు ప్రధాన మంత్రి జెండా వందనం చేసే ప్రదేశంలో, సంప్రదాయ విరుద్ధంగా జాతీయ జెండాకు బదులుగా రైతు సంఘాల జెండా, ఒక మత జెండాను ఆవిష్కరించారు.
భారత రాజధాని నగరం న్యూఢిల్లీలోని రాజ్‌పథ్‌లో భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. కరోనా ఆంక్షల నేపథ్యంలో ప్రతీ ఏడాది మాదిరిగా ఆర్భాటంగా సంబరాలు నిర్వహించలేదు. భారతీయ సంస్కృతి సంప్రదాయాలు, దేశ సామాజిక, ఆర్థిక పురోగతి, మన సైనిక సత్తాని ప్రపంచానికి చాటి చెప్పే విన్యాసాలతో రాజ్‌పథ్‌లో నిర్వహించిన పెరేడ్ దేశానికే గర్వకారణంగా నిలిచింది.
ముఖ్యఅతిథి లేకుండానే...
72వ గణతంత్ర దినోత్సవ వేడుకలను కోవిడ్-19 ముప్పుతో ముఖ్య అతిథి లేకుండానే నిర్వహించారు. గతంలో 1952, 1953, 1966 సంవత్సరాలలో ముఖ్య అతిథి లేకుండా గణతంత్ర వేడుకలు జరిగాయి.
విశేషాలు...
- భారతీయ శిల్పకళా వైభవానికి మచ్చుతునకగా నిలిచిన లేపాక్షి కట్టడం స్ఫూర్తిగా రూపుదిద్దిన శకటాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పరేడ్‌లో ప్రదర్శించింది.
- రఫేల్ యుద్ధ విమానాలను తొలిసారిగా 2021 ఏడాది పెరేడ్‌లో ప్రదర్శించారు.
- యుద్ధవిమానాలను నడిపే మొదటి మహిళా పెలైట్లలో ఒకరైన లెఫ్ట్‌నెంట్ భావనా కాంత్ ఈ పెరేడ్‌లో పాల్గొన్నారు. మహిళా యుద్ధ పెలైట్ పెరేడ్‌లో పాల్గొనడం ఇదే తొలిసారి.
- వేడుకల్లో తొలిసారిగా లద్దాఖ్ ప్రాతినిధ్యం వహించింది. లద్దాఖ్ సంస్కృతిని ప్రతిబింబించే థిక్సే మఠం శకటాన్ని ప్రదర్శించింది.
- పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ విముక్తి పొంది 50 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ఆ దేశ దళాలు ఈ సారి పెరేడ్‌ను ముందుండి నడిపించాయి.
- భారత నౌకాదళం తన శకటంలో విమాన వాహక నౌక ఐఎన్‌ఎస్ విక్రాంత్ నమూనాను ప్రదర్శించింది. అలాగే 1971 భారత్-పాక్ యుద్ధంలో నేవీ నిర్వహించిన పోరాటాన్ని కళ్లకు కట్టింది.
- ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో నిర్మాణంలో ఉన్న రామమందిరం తొలిసారిగా శకటంగా దర్శనమిచ్చింది.
- కోవిడ్-19 ముప్పుతో ఈ సారి రిపబ్లిక్ డే కవాతుని 8.5 కి.మీ. నుంచి 3.5కి.మీకి కుదించారు. కవాతుకు లెఫ్టినెంట్ జనరల్ విజయ్ కుమార్ మిశ్ర నేతృత్వం వహించారు.
ఎర్రకోట ముట్టడి
నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దాదాపు గత రెండు నెలలుగా ఢిల్లీ సరిహద్దుల్లో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న రైతులు జనవరి 26న ఢిల్లీలోకి అడుగుపెట్టారు. రోడ్లపై అడ్డుగా పెట్టిన బారికేడ్లను ధ్వంసం చేస్తూ ట్రాక్టర్లతో ఎర్రకోటను ముట్టడించారు. ఏటా స్వాతంత్య్ర దినోత్సవం రోజు ప్రధాన మంత్రి జెండా వందనం చేసే ప్రదేశంలో, సంప్రదాయ విరుద్ధంగా జాతీయ జెండాకు బదులుగా రైతు సంఘాల జెండా, ఒక మత జెండాను ఆవిష్కరించారు.
Published date : 28 Jan 2021 05:56PM