Skip to main content

Be Internet Awesome: చిన్నారుల భద్రత కోసం గూగుల్‌ ప్రారంభించిన కార్యక్రమం?

భారత్‌లో చిన్నారులకు ఇంటర్నెట్‌ భద్రతపై అవగాహన కల్పించేందుకు గూగుల్‌ తన గ్లోబల్‌ ‘బీ ఇంటర్నెట్‌ అవెసమ్‌’ కార్యక్రమాన్ని ఆగస్టు 25న ప్రారంభించింది.
హాస్య పుస్తక ప్రచురణలకు ప్రసిద్ధి చెందిన ‘అమర్‌ చిత్ర కథ’ భాగస్వామ్యంతో ఎనిమిది భారతీయ భాషల్లో ఇంటర్నెట్‌ భద్రతకు సంబంధించి పాఠాలను అందుబాటులోకి తీసుకొచ్చినట్టు సంస్థ ప్రకటించింది. ఇంటర్నెట్‌ యూజర్ల భద్రతను పెంచేందుకు మెరుగుపరిచిన ‘గూగుల్‌ సేఫ్టీ సెంటర్‌’ను ఎనిమిది భారతీయ భాషల్లో ప్రారంభించినట్లు తెలిపింది. దీంతో తప్పుడు సమాచారం, మోసాలు, చిన్నారుల భద్రతకు ముప్పు, నిబంధనల ఉల్లంఘన, ఫిషింగ్‌ దాడులు, మాల్వేర్‌కు వ్యతిరేకంగా మరింత గట్టిగా పనిచేసేందుకు వీలు కలుగుతుందని పేర్కొంది.

క్విక్‌ రివ్యూ :

ఏమిటి : బీ ఇంటర్నెట్‌ అవెసమ్‌ కార్యక్రమం ప్రారంభం
ఎప్పుడు : ఆగస్టు 25
ఎవరు : గూగుల్‌
ఎక్కడ : భారత్‌
ఎందుకు : చిన్నారులకు ఇంటర్నెట్‌ భద్రతపై అవగాహన కల్పించేందుకు...
Published date : 26 Aug 2021 06:30PM

Photo Stories