బ్యాడ్మింటన్‌కు లీ చోంగ్ వీ వీడ్కోలు
Sakshi Education
మలేసియా బ్యాడ్మింటన్ క్రీడాకారుడు, ప్రపంచ మాజీ నంబర్‌వన్ లీ చోంగ్ వీ ఆటకు వీడ్కోలు పలికాడు.
అనారోగ్య కారణాల వల్లే రిటైర్‌మెంట్ నిర్ణయం తీసుకున్నట్లు జూన్ 13న లీ చోంగ్ తెలిపాడు. ముక్కు సంబంధిత క్యాన్సర్ బారిన పడిన లీ చోంగ్ వీ 2018 ఏడాదిలో చికిత్స తీసుకున్నాడు. 348 వారాల పాటు ప్రపంచ ర్యాంకింగ్‌సలో నంబర్‌వన్‌గా కొనసాగినా... లీ చోంగ్ మూడు ప్రపంచ చాంపియన్‌షిప్‌లలో (2011, 2013, 2015), మూడుసార్లు ఒలింపిక్స్‌లో (2008, 2012, 2016) రజత పతకాలు గెలుచుకున్నాడు. తన సుధీర్ఘ కెరీర్‌లో లీ చోంగ్ వీ 69 సింగిల్స్ టైటిల్స్ సాధించాడు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : బ్యాడ్మింటన్‌కు వీడ్కోలు
ఎప్పుడు : జూన్ 13
ఎవరు : లీ చోంగ్ వీ
క్విక్ రివ్యూ :
ఏమిటి : బ్యాడ్మింటన్‌కు వీడ్కోలు
ఎప్పుడు : జూన్ 13
ఎవరు : లీ చోంగ్ వీ
Published date : 14 Jun 2019 05:36PM