బ్యాడ్మింటన్ క్రీడాకారుడు సాయిప్రణీత్ పెను సంచలనం
Sakshi Education
ఇటీవల ప్రపంచ చాంపియన్‌షిప్‌లో తాను సాధించిన కాంస్య పతకం గాలివాటంగా వచ్చినది కాదని తెలుగు తేజం, భారత బ్యాడ్మింటన్ అగ్రశ్రేణి ఆటగాడు భమిడిపాటి సాయిప్రణీత్ నిరూపించాడు.
తనదైనరోజున ఎంతటి మేటి క్రీడాకారులనైనా బోల్తా కొట్టిస్తానని ఈ హైదరాబాద్ ప్లేయర్ మరోసారి రుజువు చేశాడు. అక్టోబర్ 15న ఆరంభమైన డెన్మార్క్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్-750 టోర్నమెంట్‌లో సాయిప్రణీత్ తొలి రౌండ్‌లో పెను సంచలనం సృష్టించాడు. రెండు సార్లు ఒలింపిక్ చాంపియన్‌గా, ఐదుసార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన చైనా దిగ్గజం లిన్ డాన్‌ను వరుస గేముల్లో ఓడించి సాయిప్రణీత్ ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు.
ప్రపంచ మాజీ చాంపియన్స్ లేదా ఒలింపిక్ మెడలిస్ట్‌లైన ఆరుగురు ఆటగాళ్లను (తౌఫిక్ హిదాయత్-ఇండోనేసియా; లీ చోంగ్ వీ-మలేసియా; చెన్ లాంగ్-చైనా; విక్టర్ అక్సెల్‌సన్-డెన్మార్క్; కెంటో మొమోటా-జపాన్; లిన్ డాన్-చైనా) కనీసం ఒక్కసారైనా ఓడించిన ఏకై క భారత క్రీడాకారుడు సాయిప్రణీత్.
క్విక్ రివ్యూ:
ఏమిటి: బ్యాడ్మింటన్ క్రీడాకారుడు సాయిప్రణీత్ పెను సంచలనం
ఎవరు: సాయిప్రణీత్
ఎప్పుడు: అక్టోబర్ 15, 2019
ఎక్కడ : ఒడెన్స్ (డెన్మార్క్)

Published date : 16 Oct 2019 05:29PM