Skip to main content

బుమ్రా, స్మృతికి విజ్డెన్ పురస్కారాలు

టీమిండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రా, మహిళ బ్యాట్స్‌ఉమెన్ స్మృతి మంధానకు ప్రతిష్టాత్మక విజ్డెన్ ఇండియా అల్మానక్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్-2019 పురస్కారాలు లభించాయి.
మొత్తం ఐదుగురికి ఈ అవార్డులు ప్రకటించగా అందులో భారత్ నుంచి వీరిద్దరికి చోటు దక్కింది. మిగిలిన వారిలో ఫకర్ జమాన్ (పాకిస్థాన్), దిముత్ కరుణరత్నె(శ్రీలంక), రషీద్ ఖాన్ (ఆప్ఘాన్) ఉన్నారు. భారత్ నుంచి విజ్డెన్ పురస్కారానికి ఎంపికై న మూడో మహిళా క్రికెటర్ స్మృతి నిలిచింది. అంతకుముందు మిథాలీరాజ్, దీప్తి శర్మ ఈ ఘనత సాధించారు.

మరోవైపు టీమిండియా యువ ఓపెనర్ మయాంక్ అగర్వాల్ సైతం అరుదైన ఘనత పొందాడు. 2019, 2020కి గాను ‘విజ్డెన్’మ్యాగజైన్ ఏడో ఎడిషన్ సంచికల్లో అతడి గురించి ప్రత్యేక కథనాలు ముద్రించారు. దిగ్గజ క్రీడకారులైన గుండప్ప విశ్వనాథ్, లాలా అమర్‌నాథ్ ‘విజ్డెన్ ఇండియా హాల్ ఆఫ్ ఫేమ్’లో చోటు దక్కించుకున్నారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
విజ్డెన్ ఇండియా అల్మానక్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్-2019 పురస్కారం
ఎప్పుడు : అక్టోబర్ 25
ఎవరు : జస్ప్రీత్ బుమ్రా, స్మృతి మంధాన
Published date : 26 Oct 2019 05:48PM

Photo Stories