Skip to main content

బస్సుల్లో అగ్నిప్రమాదాలను అరికట్టేందుకు డీఆర్‌డీఓ ఆవిష్కరించిన టెక్నాలజీ?

ప్రయాణ సమయాల్లో ప్రజారవాణా బస్సుల్లో జరుగుతున్న అగ్నిప్రమాదాలను అరికట్టేందుకు రక్షణ రంగ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఓ) సరికొత్త టెక్నాలజీని తీసుకొచ్చింది.
Current Affairs

అగ్ని ప్రమాదాన్ని గుర్తించి, నివారించే ఫైర్ డిటెన్షన్ అండ్ సప్రెషన్ సిస్టం’ (ఎఫ్డీఎస్‌ఎస్)ను అభివృద్ధి చేసింది. ఎఫ్డీఎస్‌ఎస్‌కు సంబంధించిన డెమోను కేంద్ర ప్రభుత్వానికి చూపించింది. ఈ డెమోను న్యూఢిల్లీలో నవంబర్ 9న రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, రహదారులు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పరిశీలించారు.

ఎఫ్డీఎస్‌ఎస్ విశేషాలు...

  • ప్యాసింజర్ కంపార్ట్‌మెంట్ భద్రత కోసం నీటి ఆధారిత ఎఫ్డీఎస్‌ఎస్ విధానాన్ని, ఇంజన్‌లో చెలరేగే మంటలను కట్టడి చేసేందుకు ఏరో సొల్యూషన్ ఆధారిత ఎఫ్డీఎస్‌ఎస్ విధానాన్ని డీఆర్‌డీవో ఆవిష్కరించింది.
  • ప్యాసింజర్ కంపార్ట్‌మెంట్‌లో మంటలు చెలరేగిన 30 సెకన్లలో గుర్తించి 60 సెకన్లలో చల్లార్చే విధంగా ఎఫ్డీఎస్‌ఎస్‌ను తయారుచేశారు. ఇందులో భాగంగా బస్సులో 80 లీటర్ల నీటి ట్యాంకును, 6.8కేజీల నైట్రోజన్ సిలిండర్‌ను అమర్చారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి : ఫైర్ డిటెన్షన్ అండ్ సప్రెషన్ సిస్టం (ఎఫ్డీఎస్‌ఎస్) ఆవిష్కరణ
ఎప్పుడు : నవంబర్ 9
ఎవరు : రక్షణ రంగ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఓ)
ఎక్కడ : న్యూఢిల్లీ
ఎందుకు : ప్రయాణ సమయాల్లో ప్రజారవాణా బస్సుల్లో జరుగుతున్న అగ్నిప్రమాదాలను అరికట్టేందుకు

 

Published date : 10 Nov 2020 05:37PM

Photo Stories