Skip to main content

బ్రిటన్ రాణి ఎలిజెబెత్–2 భర్త, ప్రిన్స్ ఫిలిప్ కన్నుమూత

బ్రిటన్‌ రాణి ఎలిజెబెత్‌–2 భర్త, డ్యూక్‌ ఆఫ్‌ ఎడిన్‌బర్గ్‌ ప్రిన్స్‌ ఫిలిప్‌(99) ఏప్రిల్‌ 9న కన్నుమూశారు.
Current Affairs

ఈ విషయాన్ని రాణి తరఫున బంకింగ్‌çహామ్‌ ప్యాలెస్‌ ఒక ప్రకటనలో వెల్లడించింది. గ్రీకు వంశంలో పుట్టిన ఫిలిప్‌.. యువరాణి ఎలిజెబెత్‌ను పెళ్లాడడానికి తన రాచరిక హోదాలన్నీ వదులకున్నారు. ఎంతో మంది యువత జీవితాల్లో ఆయన స్ఫూర్తిని నింపారని బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ పేర్కొన్నారు. ప్రిన్స్‌ ఫిలిప్‌ గొప్ప సాహసి. బ్రిటన్‌ నేవీ కమాండర్‌గా రెండో ప్రపంచ యుద్ధం సమయంలో యుద్ధ నౌకలో సేవలందించారు.

ప్రిన్స్‌ ఫిలిప్‌ గురించి...

  • జూన్‌ 10,1921: గ్రీకు రాజ కుటుంబంలో జననం.
  • 1939 బ్రిటిష్‌ రాయల్‌ నేవీలో కమాండర్‌గా ఉద్యోగం
  • 1942 మొదటి లెఫ్ట్‌నెంట్‌గా అపాయింట్‌మెంట్‌
  • 1947 యువరాణి ఎలిజెబెత్‌ను పెళ్లాడడం కోసం గ్రీక్‌ డానిష్‌ రాయల్‌

టైటిల్స్‌ని వదులుకున్నారు.
  • 1947, నవంబర్‌ 20న ఎలిజెబెత్‌తో వివాహం
  • 1951 నేవీ కెరీర్‌ను వదులుకొని ఎలిజెబెత్‌కు అండదండలు.
  • 2017 ప్రజా జీవితం నుంచి పదవీ విరమణ
  • 2019 కారు ప్రమాదానికి లోనుకావడంతో డ్రైవింగ్‌ను వదిలేశారు
  • 2021, మార్చి 4న గుండెకు విజయవంతంగా చికిత్స చేయించుకున్నారు.
  • 2021, మార్చి 16న ఆస్పత్రి నుంచి ప్యాలెస్‌కి రాక
  • 2021, ఏప్రిల్‌ 9న తుది శ్వాస

భారత్‌ పర్యటన వివాదాస్పదం

రాణి ఎలిజెబెత్‌తో కలిసి ఫిలిప్‌ మూడుసార్లు భారత్‌ పర్యటనకు వచ్చారు. 1961, 1983, 1997లో ఆయన భారత్‌ని సందర్శించారు. 1961లో భారత్‌ పర్యటనకు వచ్చినప్పుడు ఫిలిప్‌ పులిని వేటాడడం వివాదాస్పదమైంది.

క్విక్‌ రివ్యూ :

ఏమిటి : బ్రిటన్‌ రాణి ఎలిజెబెత్‌–2 భర్త కన్నుమూత
ఎప్పుడు : ఏప్రిల్‌ 9
ఎవరు : డ్యూక్‌ ఆఫ్‌ ఎడిన్‌బర్గ్‌ ప్రిన్స్‌ ఫిలిప్‌(99)
ఎక్కడ : లండన్, బ్రిటన్‌
ఎందుకు : వయో భారంతో...
Published date : 10 Apr 2021 06:22PM

Photo Stories