Skip to main content

బ్రహ్మోస్ మిస్సైల్‌ను ఏ యుద్ధ నౌక నుంచి ప్రయోగించారు?

సూపర్‌సోనిక్ క్రూయిజ్ మిస్సైల్ బ్రహ్మోస్‌ను అక్టోబర్ 18న భారత్ విజయవంతంగా పరీక్షించింది.
Current Affairsస్టెల్త్ డెస్ట్రాయర్ ‘ఐఎన్‌ఎస్ చెన్నై’ యుద్ధ నౌక నుంచి ప్రయోగించిన ఈ క్షిపణి అరేబియా సముద్రంలోని లక్ష్యాన్ని అత్యంత కచ్చితత్వంతో ఛేదించిందని అధికారులు తెలిపారు. భారత్-రష్యా ఉమ్మడి భాగస్వామ్యంలో రూపొందిన బ్రహ్మోస్ క్షిపణులను జలాంతర్గాములు, యుద్ధనౌకలు, విమానాలతో పాటు నేలపై నుంచి కూడా ప్రయోగించే వీలుంది. ఈ ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తి చేసిన రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ(డీఆర్‌డీవో), బ్రహ్మోస్ ఏరోస్పేస్, భారత నేవీని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అభినందించారు. బ్రహ్మోస్ క్షిపణులు దాదాపు 400 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను కూడా సులువుగా ఛేదించగలవు.
Published date : 19 Oct 2020 05:38PM

Photo Stories