బోయింగ్ 737పై భారత్ నిషేధం
Sakshi Education
బోయింగ్ 737 మ్యాక్స్-8 విమానాలపై భారత ప్రభుత్వం మార్చి 12న నిషేధం విధించింది.
విమానాలు సురక్షితమేనని నిర్థారించేందుకు అవసరమైన మార్పులు, భద్రతా చర్యలు చేపట్టేవరకు నిషేధం కొనసాగుతుందని కేంద్ర పౌరవిమానయాన శాఖ తెలిపింది. అంతేకాకుండా, ఈ విమాన పెలైట్లకు వెయి్య గంటలు, కో పెలైట్‌కు 500 గంటలు నడిపిన అనుభవం ఉంటేనే అనుమతిస్తామని స్పష్టం చేసింది. ఇథియోపియా ఎయిర్‌లైన్స్ ప్రమాదం నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు బోయింగ్ 737పై ఇప్పటికే నిషేధం విధించాయి. ఇథియోపియా విమాన ప్రమాదంలో ఆరుగురు భారతీయులు సహా 157 మంది ప్రయాణికులు మృత్యువాతపడిన విషయం తెలిసిందే.
క్విక్ రివ్యూ :
ఏమిటి : బోయింగ్ 737పై నిషేధం
ఎప్పుడు : మార్చి 12
ఎవరు : భారత్
క్విక్ రివ్యూ :
ఏమిటి : బోయింగ్ 737పై నిషేధం
ఎప్పుడు : మార్చి 12
ఎవరు : భారత్
Published date : 13 Mar 2019 03:46PM