Skip to main content

బొగ్గు గనుల చట్ట సవరణకు కేబినెట్ ఆమోదం

గనులు, ఖనిజాలు (అభివృద్ధి, నియంత్రణ) చట్టం-1957, బొగ్గు గనులు (స్పెషల్ ప్రొవిజన్స్) చట్టం-2015లో సవరణలు చేస్తూ రూపొందించిన ప్రత్యేక ఆర్డినెన్స్‌కు కేంద్ర కేబినెట్ జనవరి 8న ఆమోదం తెలిపింది.
Current Affairsదీంతో బొగ్గుయేతర సంస్థలు కూడా బొగ్గు గనుల బిడ్డింగ్‌లో పాల్గొనవచ్చు. అలాగే, అంతిమంగా బొగ్గు వినియోగంపైనా ఆంక్షలు ఉండవు. వాణిజ్య అవసరాల కోసం బొగ్గు ఉత్పత్తి చేసేందుకు 2018లో ప్రైవేట్ కంపెనీలకూ అనుమతినిచ్చినప్పటికీ.. బొగ్గుపరిశ్రమయేతర సంస్థలను వేలంలో పాల్గొనేందుకు అవకాశం కల్పించలేదు.

కేబినెట్ మరికొన్ని నిర్ణయాలు
  • ఉక్కు సంస్థ నీలాచల్ ఇస్పాత్ నిగమ్ (ఎన్‌ఐఎన్‌ఎల్)లో ఆరు ప్రభుత్వ రంగ సంస్థల వాటాల వ్యూహాత్మక విక్రయానికి ఆమోదం. ఎన్‌ఐఎన్‌ఎల్‌లో ఎంఎంటీసీ, ఎన్‌ఎండీసీ, బీహెచ్‌ఈఎల్, ఎంఈసీవోఎన్, ఐపీఐసీవోఎల్, ఒడిషా మైనింగ్ కార్పొరేషన్‌లకు వాటాలు ఉన్నాయి.
  • గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో ఉన్న ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేదకు జాతీయ ప్రాధాన్య హోదా ఇవ్వాలని నిర్ణయం.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
బొగ్గు గనులు చట్ట సవరణకు ఆమోదం
ఎప్పుడు : జనవరి 8
ఎవరు : కేంద్ర కేబినెట్

మాదిరి ప్రశ్నలు
Published date : 09 Jan 2020 05:32PM

Photo Stories