బంగ్లాదేశ్ జైలు నుంచి ఏపీ మత్స్యకారుల విడుదల
Sakshi Education
పొరపాటున బంగ్లాదేశ్ సముద్ర జలాల్లోకి ప్రవేశించి ఆ దేశ కోస్టుగార్డులకు చిక్కిన విజయనగరం జిల్లాకు చెందిన 8 మంది మత్స్యకారులకు విముక్తి లభించింది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కృషితో జనవరి 29న జైలు నుంచి విడుదలయ్యారు. పూసపాటిరేగ మండలం తిప్పలవలసకు చెందిన 8 మంది మత్స్యకారులు గతేడాది సెప్టెంబర్ 27న విశాఖ ఫిషింగ్ హార్బర్ నుంచి వేటకు వెళ్లారు. సముద్రంలో బోటు మరమ్మతులకు గురికావడం, భారీ గాలుల కారణంగా అక్టోబర్ 2న భారత్ బోర్డర్ దాటి బంగ్లాదేశ్‌లోకి ప్రవేశించారు. అక్కడి కోస్టుగార్డులకు చిక్కి నాలుగు నెలలు జైలు జీవితం గడిపారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: బంగ్లాదేశ్ జైలు నుంచి ఏపీ మత్స్యకారుల విడుదల
ఎప్పుడు: జనవరి 29, 2020
ఎక్కడ: బంగ్లాదేశ్
ఎందుకు: పొరపాటున బంగ్లాదేశ్ సముద్ర జలాల్లోకి ప్రవేశించినందుకు..
క్విక్ రివ్యూ:
ఏమిటి: బంగ్లాదేశ్ జైలు నుంచి ఏపీ మత్స్యకారుల విడుదల
ఎప్పుడు: జనవరి 29, 2020
ఎక్కడ: బంగ్లాదేశ్
ఎందుకు: పొరపాటున బంగ్లాదేశ్ సముద్ర జలాల్లోకి ప్రవేశించినందుకు..
Published date : 30 Jan 2020 06:08PM