Skip to main content

బ్లూంబర్గ్ బిజినెస్ ఫోరంలో మోదీ

అమెరికాలోని న్యూయార్క్‌లో సెప్టెంబర్ 25న జరిగిన బ్లూంబర్గ్ బిజినెస్ ఫోరంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. అంతర్జాతీయ ఇన్వెస్టర్లకు భారత్ స్వర్గధామమని పేర్కొన్నారు. కార్పొరేట్ పన్నును చరిత్రాత్మక స్థాయిలో ప్రభుత్వం తగ్గించిందని, పెట్టుబడులకు ఇదొక బంగారం లాంటి అవకాశమని అభివర్ణించారు. మౌలిక సదుపాయాలపై 100 లక్షల కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నట్టు చెప్పారు. 5 ట్రిలియన్ డాలర్ల స్థాయికి (రూ.350 లక్షల కోట్లు) దేశ జీడీపీని తీసుకెళ్లాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి : బ్లూంబర్గ్ బిజినెస్ ఫోరం
ఎప్పుడు : సెప్టెంబర్ 25
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : న్యూయార్క్, అమెరికా
Published date : 26 Sep 2019 08:05PM

Photo Stories