బ్లాక్‌చెయిన్–పోస్ట్ ఆవిష్కరణ
తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియాతో కలిసి ఆగస్టు 6న రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్ బీ–పోస్ట్‌ను ఆవిష్కరించారు. ఈ విధానం ద్వారా రాజన్న సిరిసిల్ల జిల్లాలోని 1.5 లక్షల మంది సంఘాలకు చెందిన మహిళలు ‘స్త్రీ నిధి’ద్వారా మంజూరయ్యే రుణాలకు క్రెడిట్ రేటింగ్ పొందే అవకాశం ఉంటుంది. తద్వారా బ్యాంకులు, ఫైనాన్షియల్ సంస్థల నుంచి రుణాలు పొందే వీలు కలుగుతుంది. హైదరాబాద్‌కు చెందిన కాగి్నటోచెయిన్ అనే స్టార్టప్ ‘బీ పోస్ట్’ను ప్రయోగాత్మకంగా రూపొందించింది. ఈవిధానంతో రుణవితరణ, చెల్లింపులు సులువు కానున్నాయి.
క్విక్ రివ్యూ :
ఏమిటి : బ్లాక్‌చెయిన్ – ప్రొటెక్షన్ ఆఫ్ స్త్రీ నిధి ట్రాన్జాక్ష్స’(బీ–పోస్ట్) ఆవిష్కరణ
ఎప్పుడు : ఆగస్టు 6
ఎవరు : తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్, పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి సందీప్‌కుమార్
ఎందుకు:స్వయం సహాయక సంఘాల మహిళల బ్యాంకు లావాదేవీల కోసం