బీసీసీఐ టైటిల్ స్పాన్సర్‌గా పేటీఎం
Sakshi Education
స్వదేశంలో భారత క్రికెట్ జట్టు ఆడే అన్ని అంతర్జాతీయ మ్యాచ్‌లతో (టెస్టులు, వన్డేలు, టి20లు) పాటు మహిళల క్రికెట్ సహా బీసీసీఐ నిర్వహించే దేశవాళీ టోర్నీలు అన్నింటికీ ప్రముఖ డిజిటల్ వాలెట్ సంస్థ పేటీఎం మరోసారి టైటిల్ స్పాన్సర్‌గా వ్యవహరించనుంది.
ఈ మేరకు పేటీఎం మాతృసంస్థ వన్ 97 కమ్యూనికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో 2019-2023 మధ్య నాలుగేళ్ల కాలానికి ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఆగస్టు 21న బీసీసీఐ ప్రకటించింది. ఈ ఒప్పందం ప్రకారం పేటీఎం రూ.326.80 కోట్లు చెల్లించనుంది.
భారత్‌లో జరిగే మ్యాచ్‌ల సంఖ్యను పరిగణనలోకి తీసుకుంటే సుమారుగా ఒక్కో మ్యాచ్‌కు పేటీఎం రూ. 3.80 కోట్లు చెల్లిస్తుంది. గత ఏడాది రూ. 2.4 కోట్లతో పోలిస్తే ఇది 58 శాతం ఎక్కువ.
భారత్‌లో జరిగే మ్యాచ్‌ల సంఖ్యను పరిగణనలోకి తీసుకుంటే సుమారుగా ఒక్కో మ్యాచ్‌కు పేటీఎం రూ. 3.80 కోట్లు చెల్లిస్తుంది. గత ఏడాది రూ. 2.4 కోట్లతో పోలిస్తే ఇది 58 శాతం ఎక్కువ.
Published date : 22 Aug 2019 05:47PM