Skip to main content

బీపీసీఎల్‌లో వాటాల విక్రయానికి కేబినెట్ ఆమోదం

చమురు దిగ్గజం బీపీసీఎల్, షిప్పింగ్ సంస్థ ఎస్‌సీఐ, కార్గో సేవల సంస్థ కాన్‌కర్‌లో వాటాల విక్రయానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.
అలాగే కొన్ని ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాలను 51 శాతం లోపునకు తగ్గించుకునే ప్రతిపాదనకు కూడా ఆమోదం తెలిపింది. ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో నవంబర్ 20న జరిగిన సమావేశంలో ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీఈఏ) ఈ మేరకు నిర్ణయాలు తీసుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో డిజిన్వెస్ట్‌మెంట్ ద్వారా రూ. 1.05 లక్షల కోట్లు సమీకరించాలని కేంద్రం నిర్దేశించుకుంది.

కేబినెట్ నిర్ణయాల్లో ముఖ్యాంశాలు
  • దేశీయంగా రెండో అతి పెద్ద రిఫైనర్ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (బీపీసీఎల్)లో కేంద్రం తనకున్న మొత్తం 53.29 శాతం వాటాలను విక్రయించడంతో పాటు యాజమాన్య అధికారాలను కూడా బదలాయించనుంది. ఇందులో నుమాలిగఢ్ రిఫైనరీని మినహాయిస్తారు.
  • కార్పొరేట్ ట్యాక్స్‌ను 22 శాతానికి తగ్గిస్తూ ప్రవేశపెట్టిన ఆర్డినెన్స్ స్థానంలో రూపొందించిన ప్రత్యేక బిల్లుకు ఆమోదం.
  • షిప్పింగ్ కార్పొరేషన్(ఎస్‌సీఐ)లో మొత్తం 63.75 శాతం వాటాలను.. అలాగే కంటెయినర్ కార్పొరేషన్(కాన్‌కర్)లో 30.9 శాతం వాటాలు ప్రభుత్వం విక్రయించనుంది. ప్రస్తుతం కాన్‌కర్‌లో కేంద్రానికి 54.80 శాతం వాటాలు ఉన్నాయి.
  • టీహెచ్‌డీసీ ఇండియా, నార్త్ ఈస్టర్న్ ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ (నీప్‌కో)లో మొత్తం వాటాలను ఎన్‌టీపీసీకి కేంద్రం విక్రయించనుంది.
  • నియంత్రణ అధికారాలు తనకే ఉండే విధంగా.. ఇండియన్ ఆయిల్(ఐవోసీ)లో వాటాలను 51 శాతం లోపునకు కేంద్రం తగ్గించుకోనుంది.
Published date : 21 Nov 2019 05:49PM

Photo Stories