బిహార్‌లో లోక్‌సభ స్థానాల సంఖ్య?
Sakshi Education
బిహార్‌లోని నితీశ్ కుమార్ ప్రభుత్వం ఫిబ్రవరి 9న మంత్రివర్గ విస్తరణ చేపట్టింది. మొత్తం 17 మంది కొత్త సభ్యులను కేబినెట్‌లో చేర్చింది.
వీరి చేత బిహార్ గవర్నర్ ఫగు చౌహాన్ ప్రమాణ స్వీకారం చేయించారు. తాజా సభ్యులతో మొత్తం మంత్రుల సంఖ్య 34కు చేరింది. బిహార్ అసెంబ్లీ స్థానాల ప్రకారం చూస్తే 36 మంది వరకూ మంత్రులు ఉండవచ్చు. బిహార్‌లో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలు, 40 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి.
బిహార్ రాష్ట్రం....
రాజధాని: పాట్నా
శాసనసభ సీట్లు: 243
శాసనమండలి: 95
లోక్‌సభ సీట్లు: 40 (జనరల్-34, ఎస్సీ-6, ఎస్టీ-0)
రాజ్యసభ సీట్లు: 16
హైకోర్టు: పాట్నా హైకోర్టు
ముఖ్య భాషలు: హిందీ, ఉర్దూ,అంగిక, బోజ్‌పూరి, మగధి, మైథిలీ
ప్రధాన మతాలు: హిందూయిజం, ఇస్లాం, బుద్దిజం, క్రిస్టియానిటి.
Published date : 10 Feb 2021 06:38PM