బిహార్‌లో 103 మంది చిన్నారులు మృతి
Sakshi Education
బిహార్ రాష్ట్రంలో మెదడువాపు వ్యాధి కారణంగా 103 చిన్నారులు మరణించారు.
ముజఫర్‌పూర్‌లో ఆరుగురు పిల్లలు జూన్ 17న ప్రాణాలు కోల్పోవడంతో మృతి చెందిన వారి సంఖ్య 103కి చేరింది. చిన్నారుల మరణాలపై స్పందించిన రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ బాధిత కుటుంబాలు ఒక్కొక్కరికి రూ.4 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. మరోవైపు బిహార్‌లో చిన్నారుల మరణాలపై వివరణ కోరుతూ కేంద్ర ఆరోగ్య శాఖకు, బిహార్ ప్రభుత్వానికి జాతీయ మానవ హక్కుల కమిషన్ నోటీసులు పంపింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : 103 మంది చిన్నారులు మృతి
ఎప్పుడు : జూన్ 17
ఎక్కడ : బిహార్
ఎందుకు : మెదడువాపు వ్యాధి కారణంగా
క్విక్ రివ్యూ :
ఏమిటి : 103 మంది చిన్నారులు మృతి
ఎప్పుడు : జూన్ 17
ఎక్కడ : బిహార్
ఎందుకు : మెదడువాపు వ్యాధి కారణంగా
Published date : 18 Jun 2019 05:28PM