బెంగళూరులో గూగుల్ ఏఐ ల్యాబ్ ప్రారంభం
Sakshi Education
టెక్నాలజీ దిగ్గజం గూగుల్ కర్ణాటక రాజధాని బెంగళూరులో గూగుల్ రీసెర్చ్ ఇండియా పేరుతో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) పరిశోధనా యూనిట్‌ను ప్రారంభించింది.
సెప్టెంబర్ 19న జరిగిన ఈ ప్రారంభ కార్యక్రమంలో కేంద్ర న్యాయ, సమాచార, ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ పాల్గొన్నారు. బెంగళూరు ఏఐ కేంద్రంలో భారత్ కోసం ఉత్పత్తులను అభివృద్ధి చేయడంతోపాటు, వాటిని అంతర్జాతీయ మార్కెట్లకు తీసుకెళ్లాలన్నది గూగుల్ ప్రణాళిక. హెల్త్‌కేర్, వ్యవసాయం, విద్య తదితర రంగాల్లో సవాళ్ల పరిష్కారానికి కంప్యూటర్ సైన్స్, ఏఐ పరిశోధనలను ఈ కేంద్రం మరింత ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తుందని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ తెలిపారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : గూగుల్ రీసెర్చ్ ఇండియా పేరుతో ఏఐ పరిశోధనా యూనిట్ ప్రారంభం
ఎప్పుడు : సెప్టెంబర్ 19
ఎవరు : గూగుల్
ఎక్కడ : బెంగళూరు, కర్ణాటక
క్విక్ రివ్యూ :
ఏమిటి : గూగుల్ రీసెర్చ్ ఇండియా పేరుతో ఏఐ పరిశోధనా యూనిట్ ప్రారంభం
ఎప్పుడు : సెప్టెంబర్ 19
ఎవరు : గూగుల్
ఎక్కడ : బెంగళూరు, కర్ణాటక
Published date : 20 Sep 2019 05:34PM