Skip to main content

బెంగళూరు ఓపెన్ టోర్నీ విజేతగా రామనాథన్ జోడి

బెంగళూరు ఓపెన్ ఏటీపీ చాలెంజర్ టోర్నీలో రామ్‌కుమార్ రామనాథన్-పురవ్ రాజా (భారత్) జోడీ విజేతగా నిలిచింది.
Current Affairsబెంగళూరులో ఫిబ్రవరి 15న ఫైనల్లో రామనాథన్- రాజా ద్వయం 6-0, 6-3తో లియాండర్ పేస్(భారత్)-మాథ్యూ ఎబ్డెన్ (ఆస్ట్రేలియా) జంటపై విజయం సాధించింది. 55 నిమిషాలపాటు జరిగిన ఫైనల్లో రామ్-పురవ్ జంట తమ ప్రత్యర్థి జోడీ సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేసింది. విజేత రామ్-పురవ్‌లకు 9,300 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 6 లక్షల 65 వేలు)తోపాటు 125 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి.
క్విక్ రివ్యూ :
ఏమిటి
: బెంగళూరు ఓపెన్ ఏటీపీ చాలెంజర్ టోర్నీ విజేత
ఎప్పుడు : ఫిబ్రవరి 15
ఎవరు : రామ్‌కుమార్ రామనాథన్-పురవ్ రాజా (భారత్) జోడీ
ఎక్కడ : బెంగళూరు
Published date : 17 Feb 2020 05:58PM

Photo Stories